పొదుపు ఖాతా - ఇప్పుడు డిజిటల్‌గా తెరవండి

పొదుపు ఖాతా - ఇప్పుడు డిజిటల్‌గా తెరవండి

ఎవరైనా బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు, సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ను ఎంచుకుంటారు. డబ్బు పొదుపు చేయడాన్ని (సేవింగ్స్ను) ప్రోత్సహించడం లేదా ఒకరి ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేసే అలవాటును అలవర్చడం సేవింగ్స్ అకౌంట్ ఉద్దేశం. మీరు HDFC బ్యాంకులో అయితే సులభంగా ఆన్లైన్లోనే సేవింగ్స్ అకౌంట్ తెరవవచ్చు. అంతేగాక విభిన్న వేరియెంట్లతో పాటు వచ్చే విస్త్రృత శ్రేణి ఫీచర్లు, ప్రత్యేక డీల్స్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఆన్లైన్ సేవింగ్స్అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ సరళంగా, సులభంగా ఉంటుంది. ప్రక్రియను ఆన్లైన్లో కేవలం కొన్ని దశల్లోనే (స్టెప్స్లోనే) పూర్తి చేయవచ్చు.

ఇప్పుడు బ్యాంకింగ్ రంగంతో సహా ప్రతి రంగంలో డిజిటలైజేషన్ పెరిగిపోయింది. సేవింగ్స్ అకౌంట్ కలిగిన అకౌంట్ హోల్డర్ నెట్ బ్యాంకింగ్, మొబైల్యాప్లతో పాటు HDFC బ్యాంక్ నెట్వర్క్ పరిధిలోని బ్రాంచీలు, ATM సహాయంతో 24x7 తన సేవింగ్స్అకౌంట్కు యాక్సెస్ పొందవచ్చు. మీరు డెబిట్ కార్డులతో లైఫ్ స్టైల్, హెల్త్ కేర్ ప్రయోజనాలతో పాటు ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్లు పొందుతారు. HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కొన్ని వేరియంట్లు ATM ద్వారా అపరిమిత నగదు ఉపసంహరణలు (క్యాష్ విత్ డ్రా) లాంటి ఫీచర్లు, జీరో-బ్యాలెన్స్ మెయింటేనెన్స్లాంటి ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

​​​​​​​

మరి వేచి చూడటం దేనికి? HDFC బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిచి, మీ సేవింగ్స్జర్నీని ప్రారంభించడానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం ఇదే.

*రెగ్యులర్ సేవింగ్స్ (Regular Savings), వుమెన్స్ (Women's), సేవింగ్స్ మ్యాక్స్ (SavingsMax), సీనియర్ సిటిజన్స్ (Senior Citizens) & డిజిసేవ్ యూత్ (DigiSave Youth) అకౌంట్లను డిజిటల్గా తెరవవచ్చు.

మీరు ఇప్పుడు మీకు నచ్చిన సేవింగ్స్ అకౌంట్‎ను తక్షణమే తెరవవచ్చు!

 • మహిళలు, సీనియర్ సిటిజన్లు, యువత, ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేక అకౌంట్లు
 • వీడియో KYCతో వేగవంతమైన, డిజిటల్, కాగిత రహిత (పేపర్ లెస్) అకౌంట్ ఓపెనింగ్‎ని ఆస్వాదించండి
 • మీ డెబిట్/ATM కార్డు, స్మార్ట్ బై (SmartBuy) & పేజాప్ (PayZapp) ల‎తో నెలవారీ సేవింగ్స్

స్పెషాలే గోల్డ్​ (Specialé Gold) మరియు స్పెషాలే ప్లాటినం (Specialé Platinum)

 • ప్రీమియం లైఫ్ స్టైల్ ప్రయోజనాలను ఆస్వాదించండి
 • మంచి హెల్త్ కేర్​తో పాటు ఇన్సూరెన్స్ కవర్‎ని పొందండి
 • లాకర్లు, డీమాట్, ట్రేడింగ్ అకౌంట్‎పై ప్రాధాన్యతా ధరలను (ప్రిఫరెన్షియల్ ప్రైసింగ్) పొందండి.
 • మెరుగైన లావాదేవీ పరిమితులు (ట్రాన్సాక్షన్ లిమిట్స్)

సేవింగ్స్ మ్యాక్స్ (SavingsMax) అకౌంట్

 • ఆటోమేటిక్ స్వీప్-ఇన్ సదుపాయంతో మీ డబ్బుపై అధిక వడ్డీ సంపాదించండి
 • లైఫ్ టైం ప్లాటినం డెబిట్ కార్డ్
 • ₹ 1 లక్ష వరకు యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ కవర్‎తో సురక్షితంగా ఉండండి
 • ATMల వద్ద ఉచితంగా అపరిమిత సంఖ్యలో నగదు ఉపసంహరణలను (క్యాష్ విత్ డ్రాలను) పొందండి

వుమెన్స్​ సేవింగ్స్​ (Women's Savings) అకౌంట్

 • మీ ఖర్చులన్నింటి కోసం ఈజీ షాప్ (EasyShop) వుమెన్స్ డెబిట్ కార్డును పొందండి
 • ఖర్చు చేసే ప్రతీ ₹ 200 పై ₹ 1 వరకు క్యాష్ బ్యాక్ పొందండి
 • ద్విచక్ర వాహన రుణంపై 2% తక్కువ వడ్డీ రేటును ఆస్వాదించండి

రెగ్యులర్ సేవింగ్స్ (Regular Savings) అకౌంట్

 • ఉచిత పర్సనలైజ్​డ్​ చెక్ బుక్​ను పొందండి
 • మిలీనియా (Millennia) డెబిట్ కార్డ్ లేదా రూపే ప్రీమియం (Rupay Premium) డెబిట్ కార్డును ఎంచుకోండి. మీ అవసరాలకు సరిపోయే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
 • బిల్ పే (BillPay) సర్వీస్‎తో మీ బిల్లులను సురక్షితంగా, సౌకర్యవంతంగా చెల్లించండి

డిజిసేవ్ యూత్ (DigiSave Youth) అకౌంట్

 • మీ అన్ని అవసరాల కోసం డిజిటల్ ప్లాట్​ఫాం‎లు
 • మొదటి సంవత్సరం ఉచితంగా మిల్లీనియా (Millennia) డెబిట్ కార్డ్
 • అన్ని కేటగిరీలపై సంవత్సరం పొడవునా ఆఫర్లు

సీనియర్ సిటిజన్స్ (Senior Citizen's) అకౌంట్

 • సంవత్సరానికి ₹ 50,000 యాక్సిడెంట్​ హాస్పిటలైజేషన్ రీయింబర్స్‎మెంట్ కవర్​ పొందండి
 • 15 రోజుల హాస్పిటల్ ఖర్చుల కోసం రోజుకు ₹ 500 వరకు క్యాష్ అలవెన్స్ పొందండి
 • ఫిక్స్‎డ్ డిపాజిట్ల (FD) పై ప్రాధాన్యతతో కూడిన రేట్లను ఆస్వాదించండి

కిడ్స్ అడ్వాంటేజ్ (Kids Advantage) అకౌంట్

 • సంరక్షకుల సమ్మతితో పిల్లల కోసం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును పొందండి
 • ₹ 1 లక్ష వరకు ఉచిత ఎడ్యుకేషనల్ ఇన్సూరెన్స్ కవర్​ పొందండి
 • నెలకు ₹ 1,000తో భవిష్య నిధిని (ఫ్యూచర్ ఫండ్‎ని) నిర్మించుకోండి

ఇన్‎స్టిట్యూషనల్ (Institutional) సేవింగ్స్ అకౌంట్

 • క్యాష్ మేనేజ్​మెంట్ సర్వీసుల ద్వారా డొనేషన్స్, ఫీజులను మేనేజ్ చేయండి
 • HDFC బ్యాంక్ పేమెంట్ గేట్​వే ఈజీ కలెక్షన్‎కు అకౌంట్‎ను లింక్ చేసుకోండి
 • ఆన్‎లైన్​కు వెళ్లడం ద్వారా ఉద్యోగులు, విక్రేతలు మొదలైన వారి చెల్లింపులను సరళతరం చేయండి

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBDA) స్మాల్ అకౌంట్ (Basic Savings Bank Deposit Account (BSBDA) Small Account)

 • జీరో-డిపాజిట్, జీరో బ్యాలన్స్ అకౌంట్‎ను ఆస్వాదించండి
 • మీ అకౌంట్‎ను యాక్సెస్ చేయడానికి ఉచితంగా రూపే కార్డ్
 • ATMల వద్ద నెలకు 4 ఉచిత లావాదేవీలు

గవర్నమెంట్ స్కీం బెనిఫిషరీ సేవింగ్స్ అకౌంట్ (Government Scheme Beneficiary Savings Account)

 • మీ బ్యాంకింగ్ అవసరాలకు తగిన ప్రీమియం డెబిట్ కార్డును ఎంచుకోండి
 • నెలకు రూ.10 లక్షల వరకు అధిక లావాదేవీల పరిమితిని ఆస్వాదించండి
 • ఉచిత బిల్​పే (BillPay) సదుపాయంతో సులభమైన పేమెంట్ ఆప్షన్‎ పొందండి

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (Basic Savings Bank Deposit) అకౌంట్

 • జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్‎ను ఆస్వాదించండి
 • మీ అకౌంట్‎ను యాక్సెస్ చేసుకోవడానికి ఉచిత రూపే కార్డును పొందండి
 • బ్రాంచ్‎లో నెలకు 4 ఉచిత నగదు ఉపసంహరణలు (క్యాష్ విత్​డ్రాలు)

సేవింగ్స్ ఫార్మర్స్ (Saving Farmers) అకౌంట్

 • మీ అకౌంట్‎ను యాక్సెస్ చేయడానికి ఉచితంగా ATM కార్డు పొందండి
 • HDFC బ్యాంక్ ATMల వద్ద నెలకు 5 ఉచిత లావాదేవీలను ఆస్వాదించండి
 • ఉచిత బిల్​పే (BillPay) సదుపాయంతో సులభమైన పేమెంట్ ఆప్షన్‎ను పొందండి
FAQs

FAQs

1. సేవింగ్స్ అకౌంట్ అంటే ఏమిటి?

సేవింగ్స్ అకౌంట్ అనేది తమ సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేయాలని కోరుకునే చాలామంది ఎంచుకున్న డిపాజిట్ అకౌంట్. ఇది ఒక రకమైన బ్యాంకు అకౌంట్. దీనిలో మీరు మీ నిధులను ఉంచుకోవచ్చు. వాటిపై వడ్డీ సంపాదించవచ్చు. సమయంలోనైనా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది లిక్విడ్ ఫండ్స్ సౌకర్యాన్ని అందిస్తుంది.

2. ఆన్లైన్లో సేవింగ్స్ అకౌంట్ను తెరవడం ఎలా?

ఆన్లైన్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ సరళమైనది, చాలా సులభంగా ఉంటుంది. మీ ఇంటి నుండే మీ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ప్రక్రియను ప్రారంభించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. HDFC బ్యాంకులో అయితే మీరు వ్యక్తిగతంగా బ్రాంచీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వీడియో KYC (Know Your Customer) సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు.

3. సేవింగ్స్ అకౌంట్లలో ఉన్న విభిన్న రకాలు ఏమిటి?

HDFC బ్యాంకులో పలు రకాల సేవింగ్స్అకౌంట్లను ఎంచుకోవచ్చు- సేవింగ్స్ మ్యాక్స్ (Savings MAX) అకౌంట్, రెగ్యులర్ సేవింగ్స్ (Regular Savings) అకౌంట్, డిజిసేవ్ యూత్ (DigiSave Youth) అకౌంట్, వుమెన్స్ సేవింగ్స్ (Women's Savings) అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ (Senior Citizens Savings) అకౌంట్ వాటిలో కొన్ని. మా విభిన్న కస్టమర్ గ్రూపుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్బ్యాంక్ అకౌంట్ వేరియెంట్లు డిజైన్ చేయబడ్డాయి.

4. సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సిన మినిమం బ్యాలెన్స్ (కనీస నిల్వ) ఎంత?

ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ లేదా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (AMB), కస్టమర్ ఎంచుకున్న సేవింగ్స్ అకౌంట్ రకం, ఖాతాదారుని లొకేషన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు HDFC బ్యాంక్లో రెగ్యులర్ సేవింగ్స్ (Regular Savings) అకౌంట్ను తెరవాలంటే మెట్రో/పట్టణ బ్రాంచీలకు కనీసం రూ.7500, సెమీ అర్బన్ బ్రాంచీలకు రూ.5,000, గ్రామీణ బ్రాంచీలకు రూ.2,500 కనీస ప్రారంభ డిపాజిట్చేయాల్సి ఉంటుంది.

 

5. సేవింగ్స్ అకౌంట్పై వడ్డీ రేటు ఎంత?

సాధారణంగా భారతదేశంలోని బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్పై 3.5% నుండి 7% మధ్య వడ్డీ రేట్లను అందిస్తాయి. HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్పై ఆఫర్ చేసే వడ్డీ రేట్ల గురించి అవగాహన కోసం కింది టేబుల్ని గమనించండి.

సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్

 • రూ. 50 లక్షలు మరియు అంతకన్నా ఎక్కువ
 • రూ. 50లక్షల లోపు

సవరించిన రేటు 11 జూన్, 2020 నుండి అమలులోకి వచ్చింది

 • 3.50%
 • 3.00%

గమనిక:

మీ అకౌంట్లో మెయింటేన్ చేయబడ్డ రోజువారీ బ్యాలెన్స్లపై సేవింగ్స్ అకౌంట్ వడ్డీ లెక్కించబడుతుంది.

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ త్రైమాసిక విరామాల్లో చెల్లించబడుతుంది.

 

6. సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బును బదిలీ చేయడం ఎలా?

మీ సేవింగ్స్బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును బదిలీ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మొదటిది, మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి మరో వ్యక్తికి డబ్బు బదిలీ చేయడానికి మీరు బ్యాంకింగ్ మొబైల్ యాప్ని ఉపయోగించవచ్చు. మరొకటి, డిజిటల్ పద్ధతిలో డబ్బును వేగంగా, సులభంగా బదిలీ చేయడానికి నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే, బ్యాంకు బ్రాంచీని వ్యక్తిగతంగా సందర్శించి కూడా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును బదిలీ చేసే ఆప్షన్ ఉంది.

 

7. బెస్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను ఎంచుకోవడం ఎలా?

మీ వ్యక్తిగత అవసరాలకు సరిపోయే సేవింగ్స్ అకౌంట్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. HDFC బ్యాంక్ వద్ద, మీరు మా ఖాతాదారులకు లభ్యం అయ్యే విభిన్న సేవింగ్స్బ్యాంక్ అకౌంట్ వేరియెంట్లను పోల్చుకుని, మీ అవసరాలకు సరిపోయే దానిని ఎంచుకోవచ్చు. అయితే, ఇక్కడ ఆఫర్పై వడ్డీ రేట్లు, ఉండాల్సిన కనీస నెలవారీ బ్యాలెన్స్, నగదు ఉపసంహరణకు సంబంధించిన వివిధ ఆవశ్యకతలు మొదలైన ప్రధాన విషయాలను పరిశీలించుకోవాలి

8. ఆన్లైన్లో సేవింగ్స్ అకౌంట్ను తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు విధిగా ఉపయోగించాల్సిన డాక్యుమెంట్లు కింద పేర్కొనబడ్డాయి:

 • ఐడెంటిటి ప్రూఫ్ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ మొదలైనవి)
 • అడ్రస్ ప్రూఫ్ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ మొదలైనవి)
 • PAN కార్డ్
 • ఫాం 16, ఇది దరఖాస్తుదారుడి యజమాని ద్వారా జారీ చేయబడ్డ సర్టిఫికేట్. మీ వేతనం నుంచి TDS మినహాయించబడిందని ఇది తెలుపుతుంది. దరఖాస్తుదారుడి వద్ద PAN కార్డు లేనట్లయితే ఇది ఇక్కడ అవసరం అవుతుంది.
 • ఇటీవల దిగిన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

 

ఐడెంటిటీ/అడ్రస్ ప్రూఫ్ కోసం ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ల జాబితా

 • చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్
 • ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన ఓటర్ గుర్తింపు కార్డు
 • చెల్లుబాటు అయ్యే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్
 • ఆధార్
 • NREGA ద్వారా జారీ చేయబడి, రాష్ట్ర ప్రభుత్వ అధికారి చేత సంతకం చేయబడిన జాబ్ కార్డ్
 • పేరు, చిరునామా వివరాలను కలిగి ఉన్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ

ఆధార్ (AADHAAR), PAN కార్డ్, వాడకంలో ఉన్న మొబైల్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో సులభంగా అకౌంట్ ఓపెనింగ్ చేయవచ్చు.

Features and Benefits of HDFC Bank Account

How to Open Savings Account Online?

Video KYC for Bank Account Opening