హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ జర్నీ అంటే ఏమిటి?
- హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క ఇన్‌స్టా అకౌంట్ జర్నీ పూర్తిగా డిజిటల్, పొదుపు ఖాతా తెరవడానికి మీకు సహాయపడే నో కాంటాక్ట్ ప్రాసెస్. మా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లేదా మా ప్రీమియం సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్ కావచ్చు, మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా, తక్షణమే తెరవండి. మీరు మీ అకౌంట్ నెంబరు మరియు కస్టమర్ ఐడీని తక్షణమే పొందుతారు.
- ఇన్‌స్టా అకౌంట్ జర్నీ సమయంలో ఎంపిక చేయబడ్డ ప్రొడక్ట్ వేరియెంట్ ప్రకారంగా బ్యాలెన్స్ అవసరం ఉంటుంది.
- మీ అకౌంట్ నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్‌తో ముందుగానే సెట్ చేయబడింది, అంటే మీరు మీ అకౌంట్లో డబ్బు వేసిన తర్వాత వీలైనంత త్వరగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను ఉపయోగించి బ్యాంకింగ్‌ను ప్రారంభించవచ్చు.
- ఇన్‌స్టా అకౌంట్ జర్నీ ద్వారా తెరవబడ్డ అకౌంట్లు కేవలం ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎందుకంటే ఇవి పరిమిత KYC/ఖాతాదారుల గుర్తింపు ప్రక్రియను ఉపయోగిస్తాయి. ఈ సమయంలో మీరు మా బ్రాంచీల్లో దేనికైనా వెళ్లి పూర్తి KYC/కస్టమర్ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది లేదా మీ అకౌంట్‌ను డిజిటల్‌గా తెరచేటప్పుడు వీడియో KYCని ఎంచుకోవాల్సి ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్స్ యొక్క కీలక ప్రయోజనాలు ఏమిటి?
- మీరు ఈ అకౌంట్‌ను మీ అంతట మీరే 2 నిమిషాల్లో ప్రారంభించవచ్చు.
- మీరు వెంటనే మీ ఖాతా నెంబరు మరియు కస్టమర్ ఐడీని పొందుతారు.
- మీ అకౌంట్ నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్‌తో ముందుగా సెట్ చేయబడింది. తద్వారా మీరు మీ అకౌంట్‌కు డబ్బులు పంపిన వెంటనే మీ బ్యాంకింగ్ కొరకు దీనిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.
- ఇన్‌స్టా అకౌంట్‌తో మీరు బిల్లులు చెల్లించడం, డబ్బు పంపడం మరియు అందుకోవడం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ATMల నుంచి నగదును ఉపసంహరించుకోవడం మొదలైనవి సహా మీ బ్యాంకింగ్‌ని మీరు చేయవచ్చు.
- మీ ఇన్‌స్టా అకౌంట్‌ను ఉపయోగించి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా కూడా తెరవవచ్చు.
నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎలా తెరవవచ్చు?
మీరు సులభంగా ఇక్కడ క్లిక్ చేయవచ్చు లేదా ప్లేస్టోర్ నుండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ వద్ద పని చేస్తున్న మొబైల్ నెంబరు మరియు ఆధార్ ఉంటే ఈ అకౌంట్ తెరవడం చాలా సులభం మరియు త్వరితమైనది.
అవసరమైన వివరాలను పూర్తి చేయండి మరియు మీ ఆధార్ ఉపయోగించి మిమ్మల్ని మీరు ధృవీకరించుకోండి.
నేను దీనిని ఎలా ఉపయోగించాలి?
మీరు నెట్ బ్యాంకింగ్ కొరకు ముందుగా రిజిస్టర్ చేసుకున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ పాస్‌వర్డ్‌ని సెట్ చేయడమే. మీకు అందిన OTP ఆధారంగా మీ IPIN సెట్ చేయడం కొరకు మీ అకౌంట్ నెంబరు జనరేట్ చేయబడిన తరువాత మీకు పంపిన
-మెయిల్లో మీకు లింక్ వస్తుంది (ఇమెయిల్ ద్వారా మీ OTPలో కొంత భాగం మరియు మొబైల్‌కు మీ OTP యొక్క మరికొంత భాగం వస్తుంది). మీరు మీ అకౌంట్ తెరిచి, మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ని సెట్ చేసిన తరువాత, మీరు ఈ అకౌంట్‌లోనికి డబ్బును ఎక్కడి నుంచైనా బదిలీ చేయవచ్చు. మీరు అకౌంట్ నెంబరు పొందిన వెంటనే మీ శాలరీని మీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్‌కు క్రెడిట్ చేయవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ సమయంలో మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఈ అకౌంట్‌ను ఉపయోగించి మీరు బ్యాంకింగ్ చేయవచ్చు.
అర్హత
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరు తెరవగలరు?
18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న భారతీయ నివాసితులు మరియు ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఎటువంటి అకౌంట్ లేని వారు మాత్రమే.
NRIలు, HUF, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ తెరవచ్చా?
లేదు. NRIలు, HUFలు, చ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్స్టాకౌంట్ను తెరవలేరు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా ఉమ్మడి ఖాతా ను తెరవవచ్చా?
లేదు. ఈ అకౌంట్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిర్వహించగలరు
ట్రబుల్-షూటింగ్ / అప్లికేషన్ ప్రాసెస్‌కు సంబంధించినవి
అప్లికేషన్ ప్రాసెస్ ఒక బ్రాంచ్‌ను అడుగుతోంది, నేను దేనిని ఎంచుకోవాలి?
మీకు దగ్గరగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ శాఖను ఎంచుకోండి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్‌లో కార్పొరేట్ పేరును ఎలా ఎంచుకోవాలి?
మీ సంస్థ పేరు యొక్క మొదటి మూడు అక్షరాలను నమోదు చేసి, లిస్ట్ నుండి ఎంచుకోండి.
నేను ఆధార్ OTPని ఎందుకు పొందలేకపోతున్నాను?
ప్రామాణీకరణ / ధ్రువీకరణ కోసం OTPని స్వీకరించడానికి మీ ప్రస్తుత మొబైల్ నంబర్ UIDAI / ఆధార్ వెబ్సైట్లో నమోదై ఉండాలి.
మీరు సరైన నెట్వర్క్ ప్రాంతంలో ఉన్నారని నిర్ధారించుకోవాలి.
నేను ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోయినా కూడా ఖాతాను తెరవగలనా?
అవును. మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటరు ఐడి కార్డ్ వంటి ఇతర ఐడిలను ఉపయోగించవచ్చు. అయితే, ఇలాంటి సందర్భాలలో మీకు అకౌంట్ నెంబర్ వెంటనే రాదు. అకౌంట్ నెంబర్ జారీ చేయడానికి ముందే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్ సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తుంది.
నా మెయిలింగ్ మరియు శాశ్వత చిరునామా వేరువేరుగా ఉండవచ్చా?
మీ మెయిలింగ్ చిరునామా మరియు శాశ్వత చిరునామా భిన్నంగా ఉండవచ్చు.
OTP ఆధార్ వెరిఫికేషన్ విషయంలో నా మెయిలింగ్ చిరునామాను అందించడం తప్పనిసరినా?
లేదు, ఆధార్ ధృవీకరణకు మెయిలింగ్ చిరునామా ఇవ్వడం తప్పనిసరి కాదు.
UIDAI / ఆధార్ నుండి పొందిన వివరాలను నేను మార్చవచ్చా?
UIDAI నుండి పొందిన పేరు మరియు చిరునామా వంటి వివరాలను మార్చలేరు. ఈ వివరాల ఆధారంగానే మీ ఖాతా తెరవబడుతుంది.
ఆధార్ కాకుండా ఇతర KYC పత్రాలతో ఖాతాను తెరవొచ్చా ?
అవును. ఆధార్ కార్డ్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డ్ లేదా పాస్‌పోర్ట్‌తో ఖాతాలను తెరవవచ్చు. అయితే ఈ సందర్భాలలో మీకు అకౌంట్ నెంబర్ వెంటనే రాదు. అకౌంట్ నెంబర్ జారీ చేయడానికి ముందే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్ సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తుంది.
పాన్ కార్డు లేకుండా అకౌంట్ తెరవడానికి వీలవుతుందా?
మీ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే మీకు PAN / PAN రసీదు అవసరం
ఇన్‌స్టా అకౌంట్ తెరవడానికి ఆధార్ కార్డ్ కాపీ / నంబర్ ఇవ్వడం తప్పనిసరేనా ?
లేదు, ఆధార్ ఉపయోగించడం తప్పనిసరేమి కాదు. అయితే, మీ వివరాల ధ్రువీకరణ త్వరగా జరగడం వల్ల ఇది మీ ప్రక్రియను వేగంగా మరియు సులభతరం చేస్తుంది, అలాగే మీరు మీ అకౌంట్ నెంబర్‌ను ఆధార్‌తో వెంటనే పొందుతారు.
మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటరు గుర్తింపు కార్డ్ వంటి KYC పత్రాలను ఉపయోగించడం వల్ల జరిగే ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ ఖాతా నంబర్‌ను పొందే ముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది.
నా PAN కార్డ్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరా?
లేదు, మీరు మీ PAN కార్డ్ కాపీని అప్లోడ్ చేయనవసరం లేదు. మీ PAN నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.
నా అకౌంట్ తెరిచినట్లయితే నేను ఎలా ట్రాక్ చేయగలను?
మీ ఆధార్ ఉపయోగించినట్లయితే, మీరు మీ అకౌంట్ నంబర్‌ను తక్షణమే పొందవచ్చు. ఇతర ఐడిలను ఉపయోగిస్తుంటే, ఈ లింక్‌పై క్లిక్ చేసి మీకు అందించిన రిఫరెన్స్ నంబర్‌ను ఉపయోగించి మీ అప్లికేషన్ యొక్క స్థితిని మీరు తెలుసుకోవచ్చు Track My Application
నా అకౌంట్ నెంబర్ని ఎప్పుడు పొందగలను ?
మీ ఆధార్ వివరాలను UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆన్లైన్ ద్వారా ధృవీకరించిన వెంటనే మీరు మీ కస్టమర్ ఐడి మరియు ఖాతా నంబర్‌ను పొందుతారు.
మీరు ఇతర ఐడీలను ఉపయోగించినట్లయితే, అకౌంట్ నెంబర్ జారీ చేయడానికి ముందు మా బ్రాంచ్ సిబ్బంది మిమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
నేను ఇతర KYC పత్రాలను ఉపయోగించినట్లయితే నాకు తక్షణమే అకౌంట్ నంబర్ వస్తుందా?
ఆధార్ కాకుండా వేరే ఏ ఐడిని ఉపయోగించినా అకౌంట్ నెంబర్ వెంటనే జనరేట్ కాదు. మా బ్రాంచ్ సిబ్బంది ప్రామాణీకరణ / ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిచేసే వరకు మీకు రెఫెరెన్సు నెంబర్ ఇవ్వబడుతుంది. లింక్‌పై క్లిక్ చేసి, మీకు అందించిన రిఫరెన్స్ నంబర్‌ను ఉపయోగించి మీరు మీ అప్లికేషన్ యొక్క స్థితిని తనిఖీ చేయవచ్చు – Track My Application.
అప్లికేషన్ లింక్ నెమ్మదిగా ఉంటే/ ప్రతిస్పందించకపోతే?
అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు మంచి నెట్వర్క్ కనెక్టివిటీ అవసరం.
నా అకౌంట్‌కు వర్తించే పరిమితులను నేను నిర్వహించగలనని ఎలా నిర్ధారించుకోవాలి?
కేవలం ఈ క్రింది వాటిని నిర్ధారించుకోండి:
1. ఏ సమయంలోనైనా మీ ఖాతా పరిమితి రూ.1 లక్షను మించకూడదు
2. ఖాతాకు మీ వార్షిక క్రెడిట్, ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు మించకూడదు
మీ ఖాతా 1 సంవత్సరానికి చెల్లుబాటు అవుతుందని గుర్తుంచుకోండి
మీరు మీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్‌తో సంప్రదించి, ఖాతాను మీకు నచ్చిన రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ గా మార్చడానికి KYC పూర్తి చేసుకోవచ్చు. పై పరిమితులు వర్తించవు, మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో సాధారణ పొదుపు ఖాతా యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
నేను ఈ అకౌంట్‌ను సాధారణ పొదుపు ఖాతాగా మార్చవచ్చా?
అవును, ఒక సంవత్సరంలో ఎప్పుడైనా మీరు మా దగ్గరలోని బ్రాంచ్‌లో సంప్రదిస్తే KYC ని పూర్తి చేయడానికి అలాగే ఈ అకౌంట్‌ను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చడానికి మేము మీకు సహాయం చేస్తాం.
అకౌంట్‌పై నెట్ బ్యాంకింగ్ సేవలను ఎలా పొందవచ్చు?
మీ అకౌంట్ పై నెట్ బ్యాంకింగ్ ఎనేబుల్ చేయబడి ఉంటుంది, దాన్ని ఆక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఆక్టివేట్ చేసుకోవాలి అనే సూచనలతో మీకు SMS, ఈ-మెయిల్ అందుతుంది.
నెట్ బ్యాంకింగ్ కోసం కస్టమర్ ఎలా నమోదు చేసుకోవచ్చు?
మీరు నెట్‌బ్యాంకింగ్ కోసం ముందే నమోదు చేసుకున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడం. మీ IPINను సెట్ చేయడానికి OTPని మీ అకౌంట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఈ-మెయిల్లో మీకు లింక్ ఇవ్వబడుతుంది (మీరు మీ OTPలో కొంత భాగాన్ని ఈ-మెయిల్లో మరియు మీ OTPలో కొంత భాగాన్ని మొబైల్‌కు వస్తాయి)
నేను ఒక సంవత్సరంలోపు నా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్‌ను మార్చుకోకపోతే ఏమి జరుగుతుంది?
మీ అకౌంట్ పూర్తిగా రద్దు చేయబడుతుంది
ఈ అకౌంట్ ద్వారా నేను ఏ రకమైన లావాదేవీలను నిర్వహించగలను?
- మీరు బిల్లులు చెల్లించవచ్చు, రీఛార్జ్ మరియు షెడ్యూల్ పేమెంట్లను చేసుకోవచ్చు
- మీరు షాపింగ్ చేసి ఆన్లైన్లో సురక్షితంగా చెల్లించవచ్చు
- మీరు డబ్బును బదిలీ చేయవచ్చు
KYCని పూర్తి చేయడానికి మరియు నా అకౌంట్‌ని మార్చడానికి నేను బ్రాంచ్‌ను సందర్శించాలా?
అవును, మీ అకౌంట్‌ను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చడానికి ధ్రువీకరణ కోసం KYC పత్రంతో పాటు ఒక బ్రాంచ్ని సందర్శించాల్సి ఉంటుంది.
ఈ అకౌంట్ తెరవడానికి ఉన్న ఛార్జీలు ఏమిటి?
ఈ అకౌంట్ తెరవడానికి ఎటువంటి చార్జీలు ఉండవు.
నేను ఎంచుకున్న అకౌంట్ లో సేవింగ్స్ / శాలరీ అకౌంట్ యొక్క అన్ని ఫీచర్లు ఉన్నాయా? (ఉదాహరణ: సాధారణ పొదుపు ఖాతా /మహిళా పొదుపు ఖాతా /వయో వృద్ధుల ఖాతా )
లేదు, మీరు ఏదైనా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్‌లో పూర్తి KYC ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ అకౌంట్లో ఈ సౌలభ్యాలు అందుబాటులో ఉంటాయి.
నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్‌ను గరిష్టంగా ఎంత కాలం ఉంచవచ్చు?
మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్‌ను గరిష్టoగా ఒక సంవత్సరం పాటు ఉపయోగించవచ్చు. మీరు ఈ సమయంలో KYC ని పూర్తి చేసి ఈ ఖాతాను రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు . అందుకుగాను దయచేసి మీ సమీప హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ శాఖను సందర్శించండి.
నేను డబ్బును ట్రాన్స్ఫర్ చేయవలసిన తేదీ / నా శాలరీ అకౌంట్‌కు జమ కావాల్సిన తేదీ ఏమైనా ఉందా ?
లేదు. కానీ, మీరు తక్షణమే మీ అకౌంట్ కు డిజిటల్ గా నగదును బదిలీ చేసి (3 రోజుల్లో అయితే బాగుంటుంది) అకౌంట్ ను ఉపయోగించవచ్చు.
ఈ ఖాతాను డిజిటల్‌గా తెరిచేటప్పుడు నేను ఏమి ఆశించవచ్చు?
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్స్టాఅకౌంట్ నంబర్ మరియు కస్టమర్ ఐడిని వెంటనే పొందుతారు. ఖాతా ప్రారంభించే ప్రక్రియలో మీకు నెట్‌బ్యాంకింగ్ యాక్టివేషన్ లింక్‌ను కూడా పంపుతాము. ఖాతా తెరిచేటప్పుడు మీరు ఇతరులకు నగదు బదిలీ చేయాలనుకుంటే ధ్రువీకరణ కోసం కూడా అడగడం జరుగుతుంది.
నేను చెక్‌బుక్ మరియు డెబిట్ కార్డును ఎప్పుడు పొందుతాను?
హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ డెబిట్ కార్డు లేదా చెక్బుక్ని అందించదు. క్యాష్ విత్ డ్రాలతో సహా మీరు మీ లావాదేవీలన్నింటినీ డిజిటల్లో నిర్వహించవచ్చు.
నా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అకౌంట్ నుంచి నేను ఏవిధంగా నగదు ఉపసంహరణ (విత్ డ్రా) చేసుకోవచ్చు మరియు దానికి ఏదైనా ఛార్జ్ ఉందా?
ఏదైనా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ATM నుంచి నగదు ఉపసంహరణ కి మీరు మీ మొబైల్ ఫోన్ ని ఉపయోగించవచ్చు. కార్డులెస్ క్యాష్ విత్ డ్రా ఆప్షన్ ప్రెస్ చేసి సూచనలను పాటించండి. దీనికి ఎలాంటి ఛార్జీలు లేవు.
అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో నేను డిస్ కనెక్ట్ చేయబడినట్లయితే, నేను డ్రాప్ అయిన చోటు నుంచి కొనసాగవచ్చా?
అవును, మీరు డ్రాప్ అయిన పాయింట్ నుంచి తిరిగి ప్రారంభించగలుగుతారు.
నా అకౌంట్‌ను పూర్తి KYC అకౌంట్‌గా నేను ఎలా మార్చగలను?
KYCని పూర్తి చేయడం కోసం మీరు బ్రాంచ్ని సందర్శించి, మీ అకౌంట్‌ను మీకు నచ్చిన ఏదైనా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చాల్సి ఉంటుంది.
నా ఇన్‌స్టా అకౌంట్‌పై నా ఈమెయిల్ని నేను అప్డేట్ చేయగలనా/మార్చవచ్చా?
లేదు, మీ ఇన్‌స్టా అకౌంట్ ఈమెయిల్ ఐడీని మార్చడం కొరకు, దయచేసి ఏదైనా దగ్గర్లోని బ్రాంచ్‌లో KYCని పూర్తి చేయండి.