Features
మీకు రూ. 40లక్షల వరకు (కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో రూ.50లక్షల వరకు) లోన్ సదుపాయం పొందవచ్చు మీరు ఎలాంటి కోలేట్రల్(ఇతర ఆస్తుల తనఖా పెట్టాల్సిన అవసరం గానీ ఎవరైనా గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు వాయిదాలు చెల్లించకపోతే వేరే వాళ్లు చెల్లించడం) వంటివి లేకుండా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన చెల్లింపుల కోసం, వ్యాపారాన్ని విస్తరించడం కోసం సులభతరమైన రుణ సదుపాయం పొందవచ్చు
సులభంగా బిజినెస్ లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోండి
సులభంగా బిజినెస్ లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోండిమీరు ఇతర బ్యాంకులో తీసుకున్న బిజినెస్ గ్రోత్ లోన్ అమౌంట్‌ను తక్కువ ఈఎంఐలు చెల్లించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు మార్చుకోండి.
● వేరే బ్యాంకులో తీసుకున్న లోన్ బదిలీ చేసుకుంటే అత్యంత తక్కువ వడ్డీ రేటు 15.75% పొందవచ్చు
● ప్రాసెసింగ్ ఫీజు 0.99% మాత్రమే
మీ లోన్ బ్యాలెన్స్ బదిలీ చేయడానికి ఇక్కడ అప్లై చేయండి
మీకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఎలాంటి సెక్యూరిటీ(తనఖా) లేకుండా పొందవచ్చు. మీ మిగిలిన ఖాతాలోని డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ క్రెడిట్ లిమిట్‌ను కొత్త కరెంట్ ఖాతాలో ఉంచబడుతుంది. నెలవారీగా దీనిలో డ్రాఫ్ట్ సౌకర్యం వాయిదా ముగిసే వరకు ఉంటుంది. ఉపయోగించుకున్న లోన్‌కు మాత్రమే వడ్డీని చెల్లించవచ్చు
● డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం రూ.5లక్షల నుంచి 15 లక్షల వరకు
● మీరు ఎలాంటి హామీ( మీరు వాయిదాలు చెల్లించకపోతే వారు ఆ బకాయి చెల్లించేలా చూడటం వంటివి చేయడం)గానీ సెక్యూరిటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు
● 12-48 సులభతరమైన వాయిదాల్లో చెల్లింపులు చేసే అవకాశం
● ఆకర్షణీయమైన వడ్డీరేట్లు
● మొదటి ఆరునెలల వరకు ముందస్తు చెల్లింపులు గానీ, సగం చెల్లింపులు గానీ ఈ విధానంలో అనుమతించబడవు
మీ బిజినెస్ గ్రోత్ లోన్‌కు సంబంధించిన అర్హతను ఆన్లైన్లో లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ ల లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో తెలుసుకోవచ్చు. లోన్ చెల్లింపులు మీరు గతంలో తీసుకున్న గృహరుణాలు ,వాహన రుణాలు మరియు క్రెడిట్ కార్డు రుణాలకు సంబంధించిన చెల్లింపులను పరిగణలోనికి తీసుకొని వీలైనంత వేగంగా మీకు చెల్లింపులు జరుగుతాయి
మీ రుణాలకు సంబంధించిన ఈఎంఐలను 12 నుండి 48 నెలల కాలానికి చెల్లించవచ్చు
మీకు కావాల్సిన ఋణాన్ని పొందడానికి మీరు ఎస్ఎంఎస్ లేదా వెబ్ ఛాట్, క్లిక్ టూ టాక్ మరియు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా సంప్రదించవచ్చు
మీ ప్రియమైన వారి రక్షణ కోసం నామమాత్రపు ప్రీమియంతో మీ లోన్‌ను మా క్రెడిట్ ప్రొటెక్ట్ విధానంతో కవర్ చేయండి
● ప్లాన్:
● ప్రయోజనాలు:
○ ఒకవేళ వినియోగదారుడు మరణించినట్లయితే లోన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా కుటుంబాన్ని సంరక్షిస్తుంది.
○ జీవిత కాలపు వర్తింపు తో కూడిన కవరేజీ తో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది
○ మీ సేవింగ్స్‌ను లోన్ వాయిదాలను చెల్లించడానికి వాడాల్సిన అవసరం లేదు
○ నిబంధనలకు అనుగుణంగా పన్ను మినహాయింపు పొందవచ్చు
○ ఒక సులభతరమైన ప్యాకేజీ - ఋణ సదుపాయం + ఇన్సూరెన్స్
● ఈ ప్రీమియంకు సంబంధించిన నగదు వినియోగదారులకు లోన్ బదిలీ చేసే క్రమంలో ఆ లోన్ నుంచి తొలగించబడటం (ఛార్జ్ చేయడం) జరుగుతుంది. ఈ మొత్తంలో సర్వీస్ ట్యాక్స్, సర్ ఛార్జ్, సెస్ వంటివి ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి
● ఒకవేళ వినియోగదారుడు సహజమరణం లేదా అకస్మాత్తుగా మరణించినట్టయితే ఆ వినియోగదారుడు కి చెందిన నామినీకి పేమెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్( క్రెడిట్ ప్రొటెక్ట్) బదిలీ చేయబడుతుంది. దీని యొక్క పరిమితి ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ నుంచి పూర్తి ఋణపరిమితి వరకు నిబంధనలు బట్టి ఉంటుంది.
* ఇన్సూరెన్స్ కు సంబంధించి వినియోగదారులకు నిబంధనలు& మరియు షరతులు వర్తిస్తాయి. పైన పేర్కొన్న ఉత్పాదన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అందిస్తోంది