వ్యాపార వృద్ధి కోసం నియమ, నిబంధనలు

వ్యాపార వృద్ధి కోసం నియమ, నిబంధనలు

1.

బ్యాంకు నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు నేను అంగీకరిస్తున్నాను. అలాగే బ్యాంకు నియమ, నిబంధనలలో మార్పులు చేసినా నాకు సమ్మతమే.  నా ఖాతాకు సంబంధించి బ్యాంకు వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే నియమ, నిబంధనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను.

2.

బ్యాంక్ అకౌంట్ ప్రారంభం మరియు మెయింటెనెన్స్‌కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టిన, సవరించబడిన నియమ నిబంధనలకు లోబడి ఉంటానని నేను అంగీకరిస్తున్నాను.

3.

బ్యాంకులో ఏదైనా డిపాజిట్ అకౌంట్ ప్రారంభించడానికి ముందు బ్యాంకు యొక్క వినియోగదారుల మార్గదర్శకాలకు అనుగుణంగా దానికి లోబడి ఉండేందుకు నేను అంగీకరిస్తున్నాను. అందుకు అవసరమైన పత్రాలు, రుజువులను సమర్పించేందుకు తగిన గుర్తింపు కార్డులు, చిరునామా, ఫోటోగ్రాఫ్‌లు వంటి సమాచారాన్ని కేవైసీ, ఏఎంఎల్ (KYC, AML) లేదా ఇతర చట్టబద్ధమైన ఆవశ్యకతలను పూర్తి చేస్తాను.

బ్యాంకు ఖాతా తెరిచిన అనంతరం ప్రస్తుతం ఉన్న చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకుకు అవసరమైన విధంగా పై డాక్యుమెంట్లను నియమిత కాలానుసారంగా మళ్లీ సమర్పించేందుకు అంగీకరిస్తున్నాను.

4.

బ్యాంకు కలిగి ఉన్న అధికారాల ప్రకారం బిజినెస్ ఫెసిలిటేటర్స్ సర్వీసులలో నిమగ్నం చేసేందుకు (ఇకపై BFగా రిఫర్ చేయబడుతుంది) మరియు బిజినెస్ కరస్పాండెంట్లు (ఇకపై BCగా రిఫర్ చేయబడుతుంది) బ్యాంకు ఫైనాన్షియల్ సర్వీసులను విస్తరించడానికి నేను అంగీకారం తెలుపుతున్నాను. బ్యాంకింగ్ సెక్టార్ పరిధిని మరింత పెంచడానికి, BF మరియు BC చర్యలు, మినహాయింపులకు బ్యాంకు బాధ్యత వహిస్తుంది.

5.

సాధారణ పరిస్థితుల్లో కనీసం 30 రోజుల నోటీసులు ఇవ్వడం ద్వారా నా ఖాతాను ఏ సమయంలోనైనా క్లోజ్ చేసేందుకు బ్యాంకు అధికారం కలిగి ఉండేందుకు నేను అంగీకరిస్తున్నాను. ఒకవేళ నెలవారీ లేదా త్రైమాసిక బ్యాలెన్స్ అనుసరించని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు జారీ చేయకుండానే నా ఖాతాను క్లోజ్ చేసే పూర్తి హక్కు బ్యాంకు కలిగి ఉంటుంది. 

6.

బ్యాంకు కలిగిన అధికారాల మేరకు నా ఖాతాకు కేటాయించబడిన సేవలు లేదా సదుపాయాలను పూర్తిగా లేదా పాక్షికంగా ఏ సమయంలోనైనా సవరించవచ్చు. లేదా కనీసం 30 రోజుల ముందు నోటీసులు జారీ చేయటం ద్వారా లేదా ఇతర సేవలు, సదుపాయాలకు మారేందుకు నాకు ఎంచుకునే విధానం  ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతున్నాను.

7.

నా అకౌంట్ స్టేటస్ లేదా చిరునామాలో మార్పు జరిగితే దానిని వెంటనే బ్యాంకుకు తెలియజేసేందుకు అంగీకారం తెలుపుతున్నాను. ఒకవేళ చేయకపోతే ఏదైనా సమాచారం తెలిపే లెటర్లు పాత చిరునామా వద్ద డెలివరీ అయితే దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తానని అంగీకారం తెలుపుతున్నాను.

8.

బ్యాంకుకు ఆమోదించదగిన కమ్యూనికేషన్ విధానం ప్రకారం నా ఖాతాకు సంబంధించిన అన్ని సూచనలను బ్యాంకుకు తెలియజేసేలా ఉంటానని అంగీకారం తెలుపుతున్నాను.

9.

బ్యాంకు నుండి నాకు జారీచేయబడిన చెక్ బుక్, ఏటీఎం కార్డును జాగ్రత్తగా ఉంచుకుంటానని అంగీకారం తెలుపుతున్నాను. ఒకవేళ వాటిని పోగొట్టుకున్న లేదా, దొంగిలించబడ్డా నేను వెంటనే బ్యాంకుకు రాతపూర్వకంగా తెలియపరుస్తాను.

10.

బ్యాంకు సిఫార్సు చేయబడిన విధంగా నా ఖాతాలో సమయానికి అనుగుణంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుతానని అంగీకారం తెలుపుతున్నాను.

11.

నా ఖాతాకు సంబంధించిన లేదా ఏదైనా లావాదేవీలకు సంబంధించిన , బ్యాంకు సేవలకు సంబంధించి విధించే అన్ని ఛార్జీలు, ఫీజులు, వడ్డీ, ఖర్చులను చెల్లించేందుకు నా ఖాతా నుంచి డెబిట్ అయ్యేందుకు లేదా లావాదేవీలు సక్రమంగా జరగని పక్షంలో బ్యాంకు ద్వారా వాటిని తిరిగి పొందేందుకు నేను అంగీకారం తెలుపుతున్నాను. ఒకవేళ నా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే మొత్తం రికవరీ అయ్యేంత వరకు కొంతకాలం ఛార్జీలు చెల్లించేందుకు ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు  నేను అంగీకారం తెలుపుతున్నాను.

12.

ఒకవేళ ఖాతాదారుడు అకౌంట్‌లో నెలవారీ లేదా త్రైమాసికంలో మినిమమ్ బ్యాలెన్స్ అనుసరించకపోతే చెక్ బుక్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఫోన్ బ్యాంకింగ్ TINs, నెట్ బ్యాంకింగ్స్ IPINs, డెబిట్/ఏటీఎం కార్డులు మరియు పిన్ నంబర్ల కేటాయింపులను తిరస్కరించే హక్కు బ్యాంక్ కు కలిగి ఉంటుంది

13.

ఖాతా తెరిచే సమయంలో లేదా ఏదైనా బ్యాంకు లావాదేవీలు నిర్వహించే సమయంలో బ్యాంకు సేల్స్ రిప్రజెంటేటివ్‌కు ఎటువంటి మొత్తాన్నీ  నగదు రూపంలో చెల్లించనని నేను అంగీకరిస్తున్నాను. బ్రాంచీ ఆవరణలోని బ్యాంకు టెల్లర్ కౌంటర్ల ద్వారా మాత్రమే నగదు డిపాజిట్ చేస్తానని నేను అంగీకరిస్తున్నాను

14.

నా ఫ్యాక్స్ నిబంధనలను అమలు చేయడానికి బ్యాంకుకు అవసరమైన సమాచారాన్ని తగురీతిలో ఫామ్ ద్వారా రాతపూర్వకంగా ఇవ్వడానికి నేను అంగీకారం తెలుపుతున్నాను

15.

కొరియర్ లేదా మెసెంజర్ లేదా మెయిల్ లేదా ఏదైనా ఇతర విధానం ద్వారా నాకు సమాచారాన్ని ఉత్తరాల ద్వారా బ్యాంకు పంపవచ్చని, దీని వల్ల తలెత్తే ఏదైనా ఆలస్యానికి బ్యాంకు బాధ్యత వహించదని నేను అంగీకరిస్తున్నాను.

16.

బ్రాంచీలో నా ఖాతాకు సంబంధించిన ఆదేశాల ప్రకారం  వ్యక్తిగతంగా చెక్ బుక్‌లు, ఫోన్ బ్యాంకింగ్ TINs, నెట్ బ్యాంకింగ్ IPINs, డెబిట్/ఏటీఎం కార్డులు మరియు IPINs తీసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఒకవేళ వ్యక్తిగతంగా తీసుకోకపోతే కొరియర్ లేదా మెసెంజర్ లేదా మెయిల్ ద్వారా బ్యాంకు ఇతర విధానం ద్వారా నేను బ్యాంకుకు ఇచ్చిన చిరునామాకు పంపడానికి నేను అంగీకారం తెలుపుతున్నాను

17.

నేను రాతపూర్వకంగా అభ్యర్థించిన ప్రకారం బ్యాంకు ఖాతా తెరిచిన సమయంలో నాకు చెక్‌బుక్ జారీ చేయబడుతుంది. ఇంకా అదనంగా ఏమైనా చెక్‌బుక్ అవసరం అయితే ఏటీఎం ద్వారా లేదా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను విన్నవించిన ప్రకారం చెక్‌బుక్ జారీ చేయడానికి అంగీకారం తెలుపుతున్నాను.

18.

మైనర్‌లు బ్యాంకు ఖాతా తెరవాలనుకున్నప్పుడు నేచురల్ గార్డియన్ లేదా కోర్టు ద్వారా నియమింపబడ్డ గార్డియన్ హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతున్నాను. పైన పేర్కొన్న మైనర్ మేజర్ అయ్యేంత వరకు బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏవైనా లావాదేవీలు, ఇతర సమస్యలు తలెత్తిన సందర్భాలలో గార్డియన్ పూర్తి  బాధ్యత వహించాల్సి ఉంటుంది. మైనర్ మేజర్‌గా మారిన తర్వాత ఖాతాను ఆపరేట్ చేసే హక్కు గార్డియన్‌కు నిలిపివేయబడుతుంది. ఒకవేళ బ్యాంకు నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా మైనర్ తన ఖాతా నుంచి విత్‌డ్రా లేదా ఇతర లావాదేవీలకు పాల్పడితే ఆ నష్టపరిహారాన్ని గార్డియన్ నుంచి క్లెయిమ్ చేసుకునేందుకు అంగీకారం తెలుపుతున్నాను.

19.

లావాదేవీలు నిర్వహించుకోవడానికి నా ఖాతాలో తగినన్ని నిధులు లేదా క్లియర్ చేయబడ్డ బ్యాలెన్స్ లేదా ముందస్తుగా ఏర్పాటు చేయబడ్డ క్రెడిట్ సదుపాయాలు ఉన్నాయని ధ్రువీకరించుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఒకవేళ ఖాతాలో నిధులు తగినంత లేకపోతే నియమ, నిబంధనల ప్రకారం తలెత్తే ఏవైనా పరిణామాలకు బ్యాంకు బాధ్యత వహించదని అంగీకారం తెలుపుతున్నాను. ముందస్తు అనుమతి లేకుండా, ఎలాంటి నోటీస్ జారీ చేయకుండా నిధులు నిలిపివేసే ఆదేశాలను అమలు చేయడానికి బ్యాంకు తన పూర్తి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో నిధులను వడ్డీతో తిరిగి చెల్లించడానికి బాధ్యత వహిస్తానని అంగీకారం తెలుపుతున్నా. ఓవర్ డ్రాఫ్ట్ లేదా ముందస్తు క్రెడిట్ నిధులకు సంబంధించిన అన్ని ఛార్జీలను రుణరేటు వర్తించే ప్రకారం చెల్లిస్తాను. అధిక విలువ కలిగిన చెక్కులు ఖాతాలో తగినన్ని నిధులు లేకపోవడం వల్ల తిరస్కరింపబడటం,  చెక్కులు చెల్లకపోవడం వంటివి ఎక్కువ సార్లు జరిగితే చెక్‌బుక్ క్యాన్సిల్ లేదా ఖాతాను క్లోజ్ చేయడానికి అంగీకారం తెలుపుతున్నాను.

20.

ఖాతా నుంచి నగదును ఓవర్ డ్రా చేసినా, ఖాతాలో ఏదైనా క్రెడిట్‌కు విరుద్ధంగా జరిగితే ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్యాంకుకు అధికారం ఉందని అంగీకారం తెలుపుతున్నాను.

21.

BC కౌంటర్ల ద్వారా నిర్వహించబడిన లావాదేవీలు తరువాతి వర్కింగ్ డే నాడు పాస్ పుస్తకంలోకి ప్రతిబింబించబడేందుకు నేను అంగీకారం తెలుపుతున్నాను.

22.

సాంకేతిక లోపం లేదా టెలికమ్యూనికేషన్ నెట్ వర్కులో లోపం వల్ల ఏదైనా సేవలకు లేదా సదుపాయాలకు అంతరాయం కలిగించడం, ఏదైనా నియంత్రణకు మించిన సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ సిస్టమ్‌లో లోపం వల్ల  కలిగే డ్యామేజీలు, నష్టాలకు (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) బ్యాంకు బాధ్యత వహించదని నేను అంగీకరిస్తున్నాను..

23.

దిగువ పేర్కొన్న కారణాల కోసం అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఇతర సంస్థలకు వెల్లడించవచ్చని నేను అంగీకరిస్తున్నాను.

1) ఏదైనా టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ నెట్ వర్కులో పాల్గొనేందుకు

2). చట్టపరమైన ఆదేశాలను పాటించడం కోసం

3). గుర్తింపు పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ద్వారా క్రెడిట్ రేటింగ్ ఇచ్చేందుకు

4) మోసాలను నివారించడం కోసం

5) క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల కోసం.

24.

HBL గ్లోబల్ లిమిటెడ్, ఇతర మార్కెటింగ్ ఏజెంట్లు, కాంట్రాక్టర్లకు, వివిధ ఫైనాన్షియల్ కంపెనీలకు, క్రాస్ సెల్లింగ్ చేసే సంస్థల సేవలు, ప్రొడక్టులకు నేను ఖాతా తెరిచే సమయంలో ఫాంలో నింపిన విషయాలను ఇవ్వడానికి బ్యాంకుకు నేను అంగీకారం తెలుపుతున్నాను. కానీ బ్యాంకు వాళ్లు నా సమాచారం ఇచ్చేముందు నేను ఫాంలో ‘డు నాట్ కాల్’ అనే ఫెసిలిటీని రిజిస్టర్ చేసుకున్నానో లేదో ముందే సరిచూసుకుని పైన తెలిపిన వాటికి ఇవ్వాల్సి ఉంటుంది.

25.

సిబిల్‌(CIBIL)కు సమాచారం అందించడం:

ముందస్తు షరతుగా, రుణాలు, అడ్వాన్సులు, ఇతర ఫండ్-ఆధారిత, నాన్-ఫండ్ ఆధారిత క్రెడిట్ సదుపాయాల మంజూరుకు సంబంధించి బ్యాంకు సమాచారం, డేటాను బహిర్గతం చేయడానికి నా సమ్మతి అవసరం అని భావిస్తున్నాను. అప్పు తీసుకున్నది, అప్పు తీసుకోబోయేది, నాకు సంబంధించి ఏదైనా ఉంటే దానికి కట్టుబడి ఉంటాను. నా ప్రమేయం ఉంటే ఆ బాధ్యతను నేను స్వీకరిస్తాను. దీనికి సంబంధించి బ్యాంకుకు సమాచారం తెలియజేయడానికి నా అంగీకారం తెలుపుతున్నాను.

1). నాకు సంబంధించిన సమాచారం, డేటా

2) ఏదైనా క్రెడిట్ సదుపాయానికి సంబంధించిన సమాచారం లేదా డేటా (నేను ఇవ్వబడింది)

3) క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తరపున అధికారం పొందిన ఏ ఇతర ఏజెన్సీకి అయినా బహిర్గతం చేయడానికి, సమకూర్చడానికి, బ్యాంకుకు అవసరమైన విధంగా నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. నేను, బ్యాంకుకు అందించిన సమాచారం, డేటా నిజమైనవి, సరైనవి అని నేను ప్రకటిస్తున్నాను.

నాకు వర్తించే అంశాలు:

  1. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, అధికారం ఉన్న ఏ ఇతర ఏజెన్సీ అయినా, బ్యాంక్ వెల్లడించిన సమాచారం, మరియు డేటాను వారికి తగిన విధంగా ఉపయోగించవచ్చు, ప్రాసెస్ చేయవచ్చు.
  2. రిజర్వు బ్యాంకు పేర్కొన్న మేరకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, అధికారం కలిగిన ఏ ఇతర ఏజెన్సీ అయినా, వారు తయారు చేసిన సమాచారం, డేటా లేదా ఉత్పత్తులను బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు, ఇతర క్రెడిట్ మంజూరు దారులు లేదా రిజిస్టర్ వినియోగదారులను పరిగణనలోకి తీసుకోవచ్చు.

26.

ఫోర్స్ మేజూర్:

 బ్యాంకు నిబంధనలు, షరతుల ప్రకారం ఏదైనా లావాదేవీ విజయవంతం కాకపోయినా లేదా పూర్తి కాకపోయినా పనితీరును నిరోధించినట్లయితే దాని సేవలు, సౌకర్యాలకు ప్రత్యేకంగా వర్తించే బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే దానికి బ్యాంక్ బాధ్యత వహించదు. ఫోర్స్ మేజూర్ ఈవెంట్ (కింద నిర్వచించబడింది) ద్వారా ఆటంకం, ఆలస్యమైన సందర్భంలో ఫోర్స్ మేజూర్ ఈవెంట్ కొనసాగుతున్నంత కాలం దాని బాధ్యతలు నిలిపివేయబడతాయి.

“ఫోర్స్ మేజూర్ ఈవెంట్” అంటే బ్యాంకు సహేతుక నియంత్రణకు మించి ఏదైనా కారణం, పరిమితులు లేకుండా ఉండటం, కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులో లేకపోవడం వంటి ప్రక్రియలలో భాగంగా ఉల్లంఘన లేదా వైరస్ ఉన్నా లేదా చెల్లింపు లేదా డెలివరీ మెకానిజం, విధ్వంసం, అగ్నిప్రమాదం, వరదలు, పేలుళ్లు , యాక్ట్ ఆఫ్ గాడ్, ప్రజల మధ్య గందరగోళం, సమ్మెలు లేదా పారిశ్రామిక చర్యలు, అల్లర్లు, తిరుగుబాటు, యుద్ధం, ప్రభుత్వ చర్యలు, కంప్యూటర్ హ్యాకింగ్, కంప్యూటర్ డేటా, స్టోరేజ్ డివైజెస్ అనధికార ప్రాప్యత, కంప్యూటర్ క్రాష్‌లు, కంప్యూటర్ టెర్మినల్‌లో ఏదైనా వైరస్‌లు చొరబడటం, ప్రోగ్రామ్ కరప్ట్ అయిన సమయంలో, సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు లేదా కరెంట్ సరఫరా నిలిచిపోయినప్పుడు, టెలికమ్యూనికేషన్‌లో లోపాలు లేదా వైఫల్యాల ద్వారా ప్రభావితం కావడం.

27.

నష్టపరిహారం:

బ్యాంకుల చర్యలు, క్లెయిమ్ లు , డిమాండ్లు, ప్రొసీడింగ్స్, నష్టాలు, డ్యామేజీలు, ఛార్జీలు, ఖర్చులకు విరుద్ధంగా ఉంటానని, నష్టపరిహారం కలిగించనని అంగీకారం తెలుపుతున్నాను. ఏదైనా సేవలకు సంబంధించి నిర్లక్ష్యం వహించినా, తప్పుగా ప్రవర్తించినా, బ్యాంకు నియమ, నిబంధనలను ఉల్లంఘించినా, పాటించకపోయినా, బ్యాంకు ద్వారా ఏ సమయంలోనైనా ఏదైనా ఆశించినా నాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాపై చర్యలు తీసుకోవచ్చు. 

28.

తాత్కాలిక హక్కు/సముదాయపు హక్కు : 

 నేను మనస్ఫూర్తిగా బ్యాంకుకు తాత్కాలిక హక్కు లేదా సముదాయపు హక్కు  ను మంజూరు చేస్తున్నాను. బ్యాంక్ ఎప్పుడైనా నాతో ఏ ఇతర ఒప్పందాల ప్రకారం, దాని స్వంత అభీష్టానుసారం మరియు నోటీసు లేకుండా బ్యాంక్ ఎప్పుడైనా దాని నిర్దిష్ట హక్కులకు ఎటువంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవచ్చు. బ్యాంకులకు సంబంధించి ఏవైనా బకాయిలు, లోన్లకు సంబంధించిన ప్రక్రియకు తీసుకున్న ఛార్జీలు/ఫీజులు/బకాయిలు షరతులకు లోబడి చెల్లించకపోతే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు.

29.

ఇతరములు:

షరతులు మరియు నియమాలకు సంబంధించిన హక్కులకు భంగం కలిగినట్లయితే దాన్ని రుణ రద్దుగా పరిగణించే అవకాశం లేదు. ఈ నియమాలు ఆయా సమయాలకు అనుగుణంగా మారుతుంటాయి.

30.

అధికార పాలనా చట్టం:

అన్ని వాదనలు, విషయాలు మరియు వివాదాలు కేవలం ముంబైలోని సమర్థ న్యాయస్థానాల ప్రత్యేక అధికార పరిధికి లోబడి మాత్రమే ఉంటాయి. ఈ నిబంధనలు మరియు షరతులు, మరియు/లేదా బ్యాంక్ నిర్వహించే కస్టమర్ యొక్క ఖాతాల్లోని కార్యకలాపాలు, మరియు/లేదా బ్యాంక్ అందించే సేవలను వినియోగించుకోవడం అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క చట్టాలచే మాత్రమే నిర్వహించబడుతుంది. ఇందులో మరే ఇతర దేశ చట్టాల జోక్యం ఉండదు. ఈ నిబంధనలు మరియు షరతుల ప్రకారం తలెత్తే ఎటువంటి వాదనలు లేదా విషయాలకు సంబంధించిన అంశాలైనా, భారతదేశం లోని ముంబైలో ఉన్న న్యాయస్థానాల యొక్క ప్రత్యేక అధికార పరిధికి సమర్పించేందుకు కస్టమర్ మరియు బ్యాంక్ అంగీకరిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాను మినహాయించి మరే ఇతర దేశంలోని చట్టాలను పాటించనందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి బాధ్యతను బ్యాంక్ అంగీకరించదు.

31.

నాకు బ్యాంకు నుంచి అందజేయడబడిన ఉత్పత్తి లేదా సేవలో గానీ ఎలాంటి లోపాలైనా ఉంటే బ్యాంక్ గ్రీవెన్స్ సెల్ ను సంప్రదించాలనే సమాచారం నాకు తెలుసు. ఒకవేళ గ్రీవెన్స్ సెల్ లో నేను ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన సంతృప్తి కర  సమాధానం 30 రోజులలో లభించకపోతే 2006 బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ స్కీమ్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నియమించబడిన అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయగలను. బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు సంబంధించిన సమాచారం http://www.bankingombudsman.rbi.org.in ద్వారా నా అకౌంట్ కు సంబంధించిన సమాాచారాన్ని పొందగలను

32.

ఒకవేళ రెండేళ్ల పాటు నా సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌లో నా ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోయినట్లయితే (క్రెడిట్ వడ్డీ, డెబిట్ వడ్డీ వంటి సిస్టమ్ జనరేట్ చేయబడ్డ లావాదేవీలను మినహాయించి), బ్యాంకు ద్వారా నా/మా అకౌంట్‌ను 'డార్మాంట్' అకౌంట్‌గా పరిగణించేందుకు నేను అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో నా/మా (జాయింట్ హోల్డర్లందరూ) రాతపూర్వక ఆదేశాలపై మరియు హోమ్ బ్రాంచీలో’ నా’ లేదా ‘మా’  ద్వారా లావాదేవీని చేయడం ద్వారా అకౌంట్ స్టేటస్ 'యాక్టివ్'గా మారేందుకు నేను/  మేము ‘అంగీకరిస్తున్నాం. అకౌంట్ స్టేటస్ 'డార్మాంట్' స్టేటస్ లో ఉన్నంత వరకు, ATM, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ వంటి డైరెక్ట్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా లావాదేవీలు బ్యాంకు ద్వారా అనుమతించబడవని నేను/మేం అర్థం చేసుకోవాలి.

33.

ఒకవేళ నేను/మేము  ఒకే చెక్కు లేదా  ఆదేశాలను జారీ చేసినట్లయితే, ఒకటి కంటే ఎక్కువ డిమాండ్ డ్రాఫ్ట్/పే ఆర్డర్ జారీ చేయడం కోసం నా/మా అకౌంట్‌లో బహుళ డెబిట్ ఎంట్రీల తరహాలో ఇది ప్రతిబింబిస్తుందని నేను/మేము అంగీకరిస్తున్నాం.

34.

బ్యాంకు తన విచక్షణ మేరకు ఖాతాదారుని యొక్క రిస్క్ మరియు అతడి హక్కులను, ఏదైనా వ్యక్తి/ఇతర సేవా ప్రదాతలు /నిర్వాహకులు/సంస్థలు, సేకరణలు,, బకాయిలు తిరిగి పొందడం, సెక్యూరిటీని అమలు చేయడం లేదా ధృవీకరించడం, మరియు బ్యాంకుకు తగిన విధంగా ఏదైనా అవసరమైన లేదా యాదృచ్ఛికంగా చట్టపరమైన చర్యలు, విషయాలు మరియు వాటికి సంబంధించిన ఏదైనా ఉత్పత్తులు/సేవలకు సంబంధించి అనుసంధానం చేయడానికి అవసరమైన హక్కు కలిగి ఉంటుంది.

35.

ఖాతాదారుడు సమర్పించిన దరఖాస్తు, ఫొటోలు, సమాచారం, పత్రాలను బ్యాంకుకు కలిగి ఉన్న హక్కు ప్రకారం తిరిగి పొందే అవకాశం ఉండదు. వినియోగదారుడికి ఎటువంటి  నోటీస్ ఇవ్వకుండానే అతడి వ్యక్తిగత సమాచారం, డాక్యుమెంట్‌లు అందించే ఉత్పత్తులు/సేవలకు సంబంధించిన వివరాలు, డిఫాల్ట్ లు, సెక్యూరిటీ, కస్టమర్ యొక్క బాధ్యతలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (సిబిల్) లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ/నియంత్రణ/చట్టబద్ధమైన లేదా ప్రైవేట్ ఏజెన్సీ/సంస్థకు వెల్లడించే పూర్తి హక్కు అధికారం బ్యాంకుకు కలిగి ఉంటుంది. క్రెడిట్ బ్యూరో, ఆర్‌బీఐ, ఇతర బ్రాంచీలు/సబ్సిడరీలు/అఫిలియేట్లు/రేటింగ్ ఏజెన్సీలు, సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర బ్యాంకులు/ఫైనాన్షియల్ సంస్థలు, ఏదైనా థర్డ్ పార్టీలు బదిలీ చేసే ఎవరైనా కేటాయింపుదారులు/సంభావ్య కేటాయింపుదారులు, సమాచారం అవసరమైన వారు అటువంటి సమాచారాన్ని ప్రాసెస్ చేయడం,సరైన రీతిలో పబ్లిష్ చేయడం, అటువంటి మాధ్యమం ద్వారా పబ్లిషర్/బ్యాంకు/ఆర్‌బీఐ వంటి మాధ్యమాల ద్వారా ప్రచురించవచ్చు. నిబంధనల ప్రకారం కస్టమర్ నుంచి బకాయిలు రికవరీ చేసేందుకు ఉద్దేశ్యపూర్వక డిఫాల్టర్  జాబితాలో భాగంగా పేరు ప్రచురించడం, కేవైసీ (KYC) సమాచార ధృవీకరణ, క్రెడిట్ రిస్క్ విశ్లేషణ, లేదా ఇతర సంబంధిత ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది.

36.

బ్యాంకు ద్వారా ఏదైనా వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన సమాచారం సేకరించబడినట్లయితే అది బ్యాంకు వెబ్ సైట్  www.hdfcbank.comలో లభ్యమయ్యే బ్యాంకు గోప్యతా విధానానికి అనుగుణంగా ఇది వ్యవహరించబడుతుంది.

37.

నాణ్యత నియంత్రణ ప్రయోజనాల కోసం వినియోగదారులతో టెలిఫోనిక్ సంభాషణలను రికార్డ్ చేసే హక్కు బ్యాంక్ కలిగి ఉంటుంది 

38.

అందించిన డాక్యుమెంటేషన్ మరియు ఖాతా ప్రారంభ ఫారం ఉన్నప్పటికీ, మీ దరఖాస్తును అంగీకరించే / తిరస్కరించే హక్కు బ్యాంకుకు ఉంది. ఈ విషయంలో బ్యాంక్ నిర్ణయం అంతిమంగా ఉంటుంది

39.

ఏవైనా లోన్లు/సదుపాయాలు, ఇతర బ్యాంకింగ్ ఉత్పత్తులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్లాట్ ఫాం లేదా బ్యాంకు యొక్క ఏదైనా ఇదే విధమైన ఫ్లాట్ ఫారం ద్వారా లభ్యం అవుతాయి ( వినియోగదారులు/రుణగ్రహీత లు, వినియోగదారులు లాగ్ ఇన్ ఐడీ మరియు పాస్ వర్డ్ ఉపయోగించడం ద్వారా  ఖాతాలను పరిశోధించటం /పరిశీలించటం  చేసే ఫ్లాట్ ఫాంలు) మరియు ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తి చేయడానికి మరియు ఆన్‎లైన్‎లో రుణ డాక్యుమెంట్ లను నమోదు చేయడం కొరకు బ్యాంకు అటువంటి ఫ్లాట్ ఫాం ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రతి వాడకం మరియు కార్యకలాపాలు లేదా అటువంటి కస్టమర్ ఐడీ మరియు పాస్ వర్డ్ లను ఉపయోగించేటువంటి ఇతర ఫ్లాట్ ఫాంలలో ఆన్‎లైన్‎లోన్ ప్రక్రియల్లో ఎప్పటికప్పుడు ఖాతాదారుడు/రుణగ్రహీత మాత్రమే వినియోగించాలి. ఒకవేళ వ్యక్తిగతంగా అయితే పూర్తిగా భౌతికంగా మరియు మానసికంగా స్థిరంగా ఉన్న స్థితిలోనే వాడకం జరగాలి అంతే కానీ పాస్ వర్డ్ మరిచిపోవటం, తస్కరించడం, హ్యాకింగ్ మొదలైన అనైతిక పద్ధతులు అవలంబించరాదు: మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఆపరేట్ చేసే వ్యక్తి యొక్క గుర్తింపును లేదా అతడి మానసిక లేదా శారీరక స్థిరత్వాన్ని బ్యాంకు చెక్ చేయాల్సిన అవసరం లేదు.

40.

బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం కోసం ఆధార్ వివరాలను సమర్పించడం ద్వారా, కస్టమర్ ఈ క్రింది నిబంధనలు మరియు షరతులకు అంగీకరిస్తాడు:-

భారత ప్రభుత్వం జారీ చేసిన నా ఆధార్ నెంబర్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు సమర్పించాను మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో నా వ్యక్తిగత సామర్థ్యంలో మరియు / లేదా అధీకృత సంతకం చేసిన నా ఖాతాలు / సంబంధాలకు (ఉన్న మరియు క్రొత్త) లింక్ చేయడానికి స్వచ్ఛందంగా నా సమ్మతిని ఇవ్వడమైనది. భారత ప్రభుత్వం నుండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ను స్వీకరించడానికి నా ఆధార్ నంబర్‌ను ఎన్‌పిసిఐ వద్ద మ్యాప్ చేయడానికి నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు అధికారం ఇస్తున్నాను.  ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బెనిఫిట్ ట్రాన్స్‎ఫర్ లు నా వల్ల అయితే, ఈ అకౌంట్‎లో నేను అన్ని బెనిఫిట్ ట్రాన్స్‎ఫర్ లను అందుకుంటాను. నేను, సదరు ఆధార్ నెంబరు నాదేనని,, ఆధార్ చట్టం, 2016 మరియు అన్ని ఇతర అనువర్తించే చట్టాల ప్రకారం గా నా ఆధార్ నెంబరు, పేరు మరియు వేలిముద్ర/ఐరిస్ మరియు నా ఆధార్ వివరాలను పొందడం కొరకు, నా ఆధార్ వివరాలను పొందడం కొరకు నేను, ఇందుమూలంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు స్వచ్ఛందంగా నా సమ్మతిని ఇస్తున్నాను. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నా ఆధార్ వివరాలు మరియు గుర్తింపు సమాచారం డెమోగ్రాఫిక్ ప్రమాణీకరణ, ధ్రువీకరణ,

-కేవైసీ (e-KYC) ఉద్దేశ్యం,  ఓటీపీ (OTP) ప్రమాణీకరణ తో సహా బ్యాంకింగ్ సేవలు, నా ఖాతాలు/సంబంధాల యొక్క ఆపరేషన్ మరియు సబ్సిడీలు, బెనిఫిట్ లు మరియు సేవలు మరియు/లేదా బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా ఇతర సదుపాయాలను అందించడం కొరకు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నా బయోమెట్రిక్ నిల్వ/పంచుకోబడదని తెలియజేసింది మరియు ప్రామాణీకరించుకునేందుకు  మాత్రమే సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)కు సబ్మిట్ చేయబడుతుంది. బ్యాంకుకు సబ్మిట్ చేయబడ్డ నా సమాచారం పైన పేర్కొన్నవి కాకుండా మరే ఇతర ప్రయోజనాల కొరకు ఉపయోగించబడదని నేను అర్థం చేసుకోవడానికి ఇవ్వబడినది. భవిష్యత్తులో బ్యాంకుతో నా అన్ని ఖాతాలు/సంబంధాలకు నా ఆధార్ నెంబరును లింక్ చేయడానికి మరియు ధృవీకరించడానికి HDFC బ్యాంకుకు కూడా నేను అధికారం ఇస్తున్నాను. నా ద్వారా అందించబడ్డ సమాచారం ఏదైనా తప్పుడు సమాచారం అని తేలితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు లేదా దాని యొక్క అధికారులు ఎలాంటి బాధ్యత వహించరు.