Change The Way You Buy Gold This Dhanteras - Telugu

దీపావళి పండుగను ప్రారంభించే ధంతేరాస్ వేడుకను సంపద-శ్రేయస్సుకు సూచికగా జరుపుకుంటారు. దశాబ్దాలుగా భారతీయులు బంగారం కొనేందుకు ఇదే రోజున స్థానిక ఆభరణ దుకాణాలను సందర్శిస్తుండేవారు. బంగారం కొనేందుకు ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. అందుకే ఆభరణాల దుకాణాల్లో ఆ రోజున భారీ సంఖ్యలో మహిళలు గుమిగూడి ఉంటారు. పురుషులేమీ వారికి తీసిపోరు కూడా.

అయితే, కాలం మారుతోంది. ఈ రోజుల్లో బంగారం కొనుగోలు చేసేందుకు అనేక మార్గాలున్నాయి, ముఖ్యంగా పెట్టుబడి దృక్పథం నుంచి చూస్తున్నట్లయితే ఈ మార్గాల గురించి తెలుసుకోవాలి. ఈ ధంతేరాస్ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఇక్కడ మూడు సంప్రదాయేతర మార్గాలున్నాయి. భవిష్యత్తులో ఇవి మీకు లాభదాయకంగా ఉంటాయి.

బంగారు నాణేలు, బార్లు

సాంప్రదాయకంగా, ప్రజలు ఎల్లప్పుడూ ఇతర విలువైన వస్తువుల కంటే బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకే ఇష్టపడతారు. అయితే, ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం పూర్తిగా 100% స్వచ్ఛంగా ఉండదు. ఛార్జీలు కూడా దీనిలో ఇమిడి ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు విక్రయించాలని మీరు అనుకున్నట్లయితే ఇది లాభదాయకం కాకపోవచ్చు. బంగారు నాణేలు, బార్లలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సాంప్రదాయేతర మార్గమేమీ కాదు. ఎందుకంటే ఇది కూడా భౌతిక రూపమే. పైగా, స్వచ్ఛత స్థాయి 99.5 శాతం వరకూ లేదా అంతకంటే ఎక్కువ పొందొచ్చు. ఈ కాయిన్లు, బార్లు బిఐఎస్ హాల్ మార్క్ తో వస్తాయి కాబట్టి మంచి ఎంపికే ఇది.

గోల్డ్ ఈటీఎఫ్ లు

గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ లు) అనేవి మారుతున్న బంగారం ధరలపై ఆధారపడిన ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. వీటిలో పెట్టుబడి పెట్టడంతో మీకు ద్వంద్వ ప్రయోజనాలు లభిస్తాయి. మీరు బంగారంపై పెట్టుబడి పెట్టడమే గాకుండా స్టాక్స్ లో ట్రేడింగ్ చేసే సౌలభ్యాన్నీ పొందుతారు.

ఈ పెట్టుబడితో నష్టం వాటిల్లే ముప్పు చాలా తక్కువ. తమ పోర్టిఫోలియోను వైవిద్యంగా ఉంచాలనుకున్నవాళ్లకి ఇది అనువైనది. మీరు బంగారంపై ఈటిఎఫ్ లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు, ఎందుకంటే అవి చాలా సరళంగా ఉంటాయి. చాలా సులభంగా వీటిని ప్రారంభించొచ్చు. అంతే సులభంగా నిష్క్రమించొచ్చు. కావాల్సిన పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఒక గ్రాము బంగారంతోనే పెట్టుబడి పెట్టొచ్చు.

గోల్డ్ బాండ్స్:

భౌతిక రూపంలో ఉన్న బంగారానికి గోల్డ్ బాండ్లు సురక్షితమైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇవి నిల్వ ఖర్చును, పోతోందనే భయాన్ని లేకుండా చేస్తాయి. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెక్యూరిటీలను జారీ చేస్తుంది. దీన్ని బంగారం పరిమాణం ఆధారంగా నిర్ధరిస్తారు. బాండ్ లో పేర్కొన్న పరిమాణం, డీమ్యాట్, పేపర్ రూపంలో ఉన్నప్పటికీ, ఆ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడం మరియు స్వంతం చేసుకోవడంవంటిది.

ఒకవేళ మీ వద్ద వెంటనే నిధులు లేకపోయినా సరే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు గోల్డ్ ఫ్యూచర్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. నిర్ణీత తేదీనాడు నిర్దేశించిన ధర ప్రకారం నిర్ణీత పరిమాణంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా, క్యాష్ డిపాజిట్ చేసి మధ్యవర్తి ద్వారా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ధంతేరాస్ నాడు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు హెచ్ డీఎఫ్ సీ మీకు రెండు మార్గాలను అందిస్తోంది. మొదటిది ఇండియన్ గోల్డ్ కాయిన్, ఇది బిఐఎస్ హాల్ మార్క్ తో వస్తుంది. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న మొట్టమొదటి సమర్పణ ఇది. రెండవ ఆప్షన్ ముద్రగోల్డ్ బార్. ఇది స్విట్జర్లాండ్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి అవుతుంది.

రెండూ కూడా అస్సే సర్టిఫికేషన్ తో వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం స్వచ్ఛతకు అస్సే సర్టిఫికేషన్ ప్రమాణంగా ఆమోదం పొందింది. ఇవి కేవలం ఎంపికైన నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి. ట్యాంపరింగ్ కు అవకాశం లేని సెక్యూరిటీ ఫీచర్లతో వస్తాయి. భారతదేశంలోని తన ఖాతాదారులకు బంగారం దిగుమతి చేసుకునేందుకు, అమ్మేందుకు ఆర్బీఐ నుంచి ఆమోదం ఉన్న కొన్ని బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఒకటి.

హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ సావరిన్ గోల్డ్ బాండ్లు మరో ఆప్షన్; ఇవి సంవత్సరానికి 2.5% వడ్డీ రేటును కచ్చితంగా అందిస్తాయి. మీరు నెట్ బ్యాంకింగ్, మీ హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ డీమ్యాట్ ఖాతాద్వారా సులభంగా పెట్టుబడి పెట్టడొచ్చు. బాండ్లకు ఎనిమిదేళ్ల పదవీకాలం ఉంది. ఐదో సంవత్సరం నుంచే నిష్క్రమించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన వీటిని స్టాక్ ఎక్స్ఛేంజ్ లో పెట్టి ట్రేడింగ్ చేయొచ్చు. వీటిపై టిడిఎస్ వర్తించదు. లోన్స్ కోసం వీటి కొలట్రల్ గా కూడా ఉపయోగించొచ్చు. గోల్డ్ ఈటిఎఫ్ లో కూడా హెచ్ డిఎఫ్ సి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

కాబట్టి, ఓ అడుగు ముందుకేసి ఈ ధంతేరాస్ రోజున ఏదైనా భిన్నంగా చేయండి. కానీ, మీ జీవితానికి ఆహ్లాదాన్ని, మెరుపును జోడించటం మర్చిపోవద్దు!

బంగారంపై పెట్టిన పెట్టుబడి గురించి ఏం చేయాలో ఆశ్చర్యపోతున్నారా? గోల్డ్ లోన్స్ గురించి, అది చేకూర్చే ప్రయోజనాల గురించి మరింత తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి!

గోల్డ్ రూపంలో కొనుగోలు చేయాలని చూస్తున్నారా? మీ నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ చేసి > పని ప్రారంభించేందుకు ఆఫర్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి! మీరు మీ సమీపంలో ఉన్న హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ బ్రాంచీని కూడా సందర్శించవచ్చు.

ఈ ధంతేరాస్ కి, బంగారం లాంటి డీల్ పొందండి!

హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఆభరణలు కొనుగోలు చేయండి. 10 రెట్ల రివార్డు పాయింట్లు పొందండి.*

*నిబంధనలు, షరతులు వర్తిస్తాయి