నిబంధనలు మరియు షరతులు

నిబంధనలు మరియు షరతులు

1.1

రివర్సల్ ఆఫ్ శాలరీ క్రెడిట్స్: నా ఖాతాకు సంబంధించిన వరకు నా సంస్థ లేదా యజమాని అభ్యర్థన మేరకు నిధులు  ఆపడం/డెబిటింగ్/క్రెడిట్ రివర్సల్ లేదా ఏదైనా అధిక మొత్తం డబ్బులు నా ఖాతాలో  సంస్థ లేదా యజమాని నా దృష్టికి తీసుకువచ్చి వేసినట్లైతే దానికి బ్యాంక్ బాధ్యత వహించదు అనే విషయాన్ని బేషరతుగా నేను అంగీకరిస్తున్నాను.

1.2

నా ఖాతాను బ్యాంకులో ఓపెన్ చేయడానికి నా ఉద్యోగ పరిస్థితులతో నేను పనిచేయుచున్న సంస్థ ద్వారా ప్రారంభించారు. ఇది “శాలరీ అకౌంట్” గా ఓపెన్ చేయబడిందని విశ్వసిస్తున్నాను. ఈ ఖాతా నాకు సంస్థ మరియు బ్యాంకు ద్వారా లభించింది. బ్యాంకు నా శాలరీ అకౌంట్‎ కు సంబంధించి కల్పించిన కొన్ని సదుపాయాలు అందజేయబడుతున్నాయని భావిస్తాను, నేను సంస్థ /యజమాని దగ్గర పనిచేసే విషయాన్ని అక్కడ పనిచేయని విషయాన్ని బ్యాంకుకు సమాచారం అందిస్తాను. ఇక్కడ సంస్థ /యజమాని అనే పదం నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో ఆ విషయాన్ని సూచిస్తూ.. వారి వల్ల నాకు ఈ బ్యాంకులో శాలరీ అకౌంట్ ప్రారంభమైందని నమ్ముతాను

1.3

శాలరీ అకౌంట్ ద్వారా లభించే సదుపాయాలు కంపెనీకి మరియు బ్యాంకుకు తరచుగా జరిగే లావాదేవీల ద్వారా లభిస్తున్నాయని అర్థం చేసుకోగలను 

1.4

నా యజమాని / సంస్థ అందించినట్లుగా సంబంధిత ఖాతాల్లో జీతం జమ చేయడానికి ముందు ఖాతాదారుడి పేరు ఖాతా నంబర్‌తో లెక్కించబడదని నేను అర్థం చేసుకున్నాను మరియు అంగీకరిస్తున్నాను.

1.5

జీతాల క్రెడిట్ కోసం సరైన ఖాతా నంబర్‌ను అందించే బాధ్యత నా యజమాని / సంస్థ కే ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను మరియు అంగీకరిస్తున్నాను ఈ విధంగా నా యజమాని / సంస్థ అందించిన అటువంటి తప్పు ఖాతా సంఖ్య వల్ల తలెత్తే ఏదైనా తప్పు క్రెడిట్‌కు నేను బ్యాంకును బాధ్యుడిని చేయను. 

1.6

నిరంతరాయంగా మూడు నెలల పాటు నా శాలరీ అకౌంట్ లో శాలరీ క్రెడిట్స్ లేనట్లయితే, ఖాతాదారునికి / నాకు నిబంధనల ప్రకారం ఎటువంటి సమాచారం లేకుండా శాలరీ అకౌంట్ స్థితిని HDFC సేవింగ్స్ రెగ్యులర్ అకౌంట్ కు మార్చడానికి బ్యాంక్ హక్కును కలిగి ఉందని నేను అంగీకరిస్తున్నాను. సేవింగ్స్ రెగ్యులర్ అకౌంట్ పై ఈ నిబంధనలు మరియు షరతులు బ్యాంకు వెబ్సైట్ లో ప్రచురించబడింది.

1.7

యజమాని / సంస్థ సూచనల మేరకు మరియు / లేదా జీతం ఖాతాకు క్రమం తప్పకుండా లేదా నేను నిలిపివేసిన సందర్భంలో ఎటువంటి మొత్తాలు జమ చేయబడలేదని గమనించినట్లయితే బ్యాంక్ దాని స్వంత మరియు సంపూర్ణ అభీష్టానుసారం నాకు 30రోజుల నోటీసును ఇచ్చి  శాలరీ అకౌంట్ ను  మూసి వేయవచ్చని నేను దీని ద్వారా అంగీకరిస్తున్నాను. 

1.8

నా ఖాతాలోని ఆపరేషన్ రీతిలో ఏదైనా సవరణను నా ఖాతాకు ఉమ్మడి హోల్డర్లందరి సమ్మతితో బ్యాంక్ ప్రభావితం చేస్తుందని నేను అంగీకరిస్తున్నాను. నా ఖాతాకు ఉమ్మడి హోల్డర్లందరి అనుమతి లేకుండా స్వీకరించిన సవరణ కోసం బ్యాంక్ ఎటువంటి అభ్యర్థనను స్వీకరించదని నేను అంగీకరిస్తున్నాను. ఖాతా తెరిచే సమయంలో అంగీకరించిన ఆపరేషన్ విధానానికి అనుగుణంగా బ్యాంక్ సూచనలను గౌరవించడం కొనసాగించాలని నేను అంగీకరిస్తున్నాను.

2

శాలరీ అకౌంట్‎ కస్టమర్ కు లభించే అదనపు సౌలభ్యం- శాలరీ అకౌంట్ పై జీవిత ప్రమాద బీమా (PADC)

2.1

శాలరీ అకౌంట్ మరియు టైటానియం రాయల్ డెబిట్ కార్డుకు సంబంధించిన షరతులు మరియు నిబంధనలు కింద సూచించబడినవి

 • ప్రమాదాల ద్వారా శారీరకంగా గాయపడి మరణించడం వలన
 • శారీరక గాయం వలన సంభవించే ప్రమాదవశాత్తు మరణం మరియు ఇతర అన్ని కారణాల నుండి ప్రత్యక్షంగా మరియు వ్యక్తిగతంగా ప్రమాదం జరిగిన తేదీ నుండి పన్నెండు (12) నెలల్లో మరణానికి దారితీసినపుడు 
 • ప్రమాదం జరిగిన తేదీన, ఖాతాదారుడికి 
 • నిర్దిష్ట ఆఫర్ పొడిగించబడిన సంస్థ యొక్క బోనఫైడ్ ఉద్యోగులు (70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు)
 • హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ప్రోగ్రాం కింద శాలరీ అకౌంట్ కలిగి ఉండి, ఆ నెల లేదా ముందు నెలలో జీతం క్రెడిట్ అయి ఉండాలి 
 • నష్టం జరిగిన తేదీకి ముందు  6 నెలల్లో డెబిట్ కార్డు ఉపయోగించి కనీసం ఒక కొనుగోలు లావాదేవీని చేసి ఉండాలి.
 • వాయు మార్గ ప్రమాదాల డెత్ క్లెయిమ్ విషయంలో టికెట్‌ను శాలరీ అకౌంట్ కు లింక్ చేసిన డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసి ఉండాలి
 • ప్రాథమిక ఖాతా లబ్ధిదారుడికి  మాత్రమే కవర్ వర్తిస్తుంది


శాలరీ ఫ్యామిలీ అకౌంట్  కవర్ కు సంబంధించిన షరతులు మరియు నిబంధనలు కింద సూచించబడినవి

 • యాక్సిడెంట్ వల్ల శారీరకంగా గాయపడి మరణించడం వలన
 • శారీరక గాయం వలన సంభవించే ప్రమాదవశాత్తు మరణం మరియు ఇతర అన్ని కారణాల నుండి ప్రత్యక్షంగా మరియు స్వతంత్రంగా ప్రమాదం జరిగిన తేదీ నుండి పన్నెండు (12) నెలల్లో మరణానికి దారితీసినపుడు
 • ప్రమాదం జరిగినప్పుడు, ప్రాథమిక ఖాతా లబ్ధిదారుడికి 
 • అతడి వయస్సు 70 సంవత్సరాల లోపు ఉండాలి
 • ఖాతాదారుడితో అతని / ఆమె సంబంధం కారణంగా శాలరీ ఫ్యామిలీ ఖాతాను కలిగి ఉండాలి  మరియు అలాంటి జీతం ఖాతా జీరో బ్యాలెన్స్ ఖాతా మరియు ముందు నెల లేదా ఆ నెలలో జీతం క్రెడిట్ పొంది ఉండాలి 
 • నష్టం జరిగిన తేదీకి ముందు  6 నెలల్లో, డెబిట్ కార్డు ఉపయోగించి కనీసం ఒక కొనుగోలు లావాదేవీని చేసి ఉండాలి
 • వాయు మార్గ ప్రమాదాల డెత్ క్లెయిమ్ విషయంలో టికెట్‌ను శాలరీ ఫ్యామిలీ అకౌంట్ కు లింక్ చేసిన డెబిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసి ఉండాలి

ఈ కవర్ ప్రాథమిక ఖాతా లబ్ధిదారుడికి మాత్రమే వర్తిస్తుంది


2.2

క్లెయిమ్ చేసే విధానం: 

 • ఖాతాదారుడు మరణించిన సందర్భంలో, లబ్ధిదారుడు ఖాతా ఉన్న శాఖను సంప్రదించాలి, మరియు ఆ శాఖ వినియోగదారునికి అవసరమైన పత్రాలపై మార్గనిర్దేశం చేస్తుంది.
 • ఈ పత్రాలను బ్రాంచ్ స్వీకరించిన తర్వాత, శాలరీ అకౌంట్ క్లెయిమ్  ప్రాసెస్ చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బీమా సంస్థతో సంబంధాలు పెట్టుకుంటుంది. ఏదేమైనా, శాఖ డాక్యూమెంట్లు స్వీకరించి నంత మాత్రాన క్లెయిమ్ అంగీకరించినట్లు కాదు. మరణం సంభవిస్తే లబ్ధిదారుడు వెంటనే ఖాతా ఉన్న శాఖకు సమాచారం అందించాలి. పాలసీ ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజులలోపు బీమా కంపెనీకి (బ్యాంక్ ద్వారా) సమాచారం ఇవ్వాలి మరియు క్లెయిమ్‌కు సంబంధించిన అన్ని సహాయక పత్రాలు ప్రమాదం జరిగిన తేదీ నుండి అరవై (60) రోజులలోపు బీమా కంపెనీకి సమర్పించాలి.


2.3

డిస్‎క్లైమర్: 

 • ఏదైనా బీమా కవరేజ్‎ కు సంబంధించిన అంశాలకు బ్యాంక్ ఏవిధంగానూ బాధ్యవహించదు. కార్డుదారుడు మరణించినట్లయితే బీమా కంపెనీ పూర్తిగా బాధ్యత వహిస్తుందని మరియు అటువంటి బీమా కవర్‎ కు సంబంధించి లేదా అటువంటి బీమా కవర్‎ కు సంబంధించి ఏదైనా లోపం లేదా మరే విషయానికి బ్యాంకు బాధ్యత వహించదని ఖాతాదారుడు ప్రత్యేకంగా ధృవీకరిస్తాడు. నష్టపరిహారాన్ని రికవరీ చేయడం లేదా చెల్లించడం, క్లెయింల ప్రాసెసింగ్ లేదా సెటిల్‎మెంట్ లేదా మరోవిధంగా సెటిల్‎మెంట్ చేయడంతో సహా అన్ని విషయాలను బీమా కంపెనీతో నేరుగా పరిష్కరించుకోవాలి.
 • ఖాతాదారుడు సంబంధిత బీమా పాలసీ యొక్క నిబంధనల ప్రకారంగా మంచి స్థితిలో మెయింటైన్ చేయడం ద్వారా మాత్రమే శాలరీ అకౌంట్లకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని ధృవీకరిస్తాడు.  అకౌంట్ క్లోజ్ చేయడం లేదా సేవింగ్స్ రెగ్యులర్ అకౌంట్‎ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మార్చడం వల్ల, అటువంటి బీమా కవర్ యొక్క ప్రయోజనం ఆటోమేటిక్‎ గా రద్దవుతుంది. అలా చేసిన తేదీ నుండే దాని ఇన్సూరెన్స్ కవర్ ఆగిపోతుంది. తన అకౌంట్‎ ను కొనసాగింపు సమయంలో కూడా, అటువంటి బీమా కవర్ యొక్క ప్రయోజనాన్ని బ్యాంకు ఏ సమయంలోనైనా రద్దు చేయవచ్చు, ఉపసంహరించుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు మరియు ఈ ప్రయోజనాలను కొనసాగించేందుకు బ్యాంకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత లేదని కూడా ఖాతాదారుడు అంగీకరిస్తాడు.
 • బీమా కంపెనీ అనేది మార్పుకు లోబడి మరియు ఇన్సూరెన్స్ కవర్ అనేది పాలసీ యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది.


3

కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్

3.1

మైనర్ తరఫున అతని / ఆమె సహజ సంరక్షకుడు లేదా న్యాయస్థాన పరిధిలో నియమించబడ్డ సంరక్షకుడు ఒక ఖాతాను తెరవవచ్చు. పైన పేర్కొన్న మైనర్ మేజర్ అయ్యే వరకు పైన పేర్కొన్న ఖాతాలోని ఏదైనా 1 వివరణ యొక్క అన్ని లావాదేవీలలో సంరక్షకుడు మైనర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. మైనర్ మెజారిటీ సాధించిన తరువాత, ఖాతాను నిర్వహించడానికి సంరక్షకుడి హక్కు ఆగిపోతుంది.


3.2

మైనర్ ఖాతాకు ఏ ఓవర్‌డ్రాఫ్ట్ లేదా ఏదైనా రుణాలు తీసుకునే సదుపాయం ఉండదని సంరక్షకుడు అంగీకరిస్తాడు.

3.3

ఏదైనా కారణం చేత సరిపోని బ్యాలెన్స్ ఉంటే లేదా మైనర్ ఖాతా ఓవర్‌డ్రాన్ అయినట్లయితే, అక్కడ నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా పరిణామాలకు బాధ్యత వహించకుండా, చెప్పిన ఖాతాలో డ్రా అయిన చెక్కులను నిరాకరించే  హక్కు బ్యాంకుకు ఉంటుంది.

3.4

ఎటిఎం / డెబిట్ కార్డు జారీ చేసేటప్పుడు ఎటిఎం / డెబిట్ కార్డుకు వర్తించే అన్ని నిబంధనలు మరియు షరతులు మరియు ఇక్కడ పేర్కొన్న దాని ఉపయోగం వర్తిస్తుందని సంరక్షకుడు అంగీకరిస్తాడు.

3.5

ఎటిఎమ్ / డెబిట్ కార్డ్ వాడకంతో సహా మైనర్ ఉపసంహరణ, మైనారిటీ కారణంగా వ్యక్తిగతంగా మైనర్‌కు ఎటువంటి బాధ్యత వహించదని సంరక్షకుడు అంగీకరిస్తాడు. దీని ప్రకారం, అటువంటి బాధ్యత మొత్తం సంరక్షకుడిచే తీసుకోబడుతుంది మరియు సంరక్షకుడు మాత్రమే విడుదల చేయగలుగుతాడు. ATM / డెబిట్ కార్డుల వాడకంతో సహా మైనర్ ఖాతాకు అన్ని డెబిట్‌లతో సంరక్షకుడు పూర్తిగా కట్టుబడి ఉంటాడు.

3.6

మైనర్ ఖాతా నుండి ఓవర్‌డ్రాన్ అయిన అన్ని ఛార్జీలు, ఫీజులు, వడ్డీలు, ఖర్చు లేదా మొత్తాన్ని తిరిగి పొందడానికి బ్యాంక్ తన / ఆమె ఖాతాల్లో దేనినైనా డెబిట్ చేయడానికి అర్హత కలిగి ఉంటుందని సంరక్షకుడు అంగీకరిస్తాడు.

3.7

మైనర్ ఖాతాలో సంరక్షకుడి కోసం జీవిత బీమా కవర్ వంటి ఏదైనా ప్రత్యేక సదుపాయం ఇవ్వబడితే, ఇక్కడ నిబంధన 15.59.1 & 15.59.2 నిబంధన ముటాటిస్ ముటాండిస్‌ను వర్తింపజేస్తుంది. అటువంటి బీమా కవరేజీకి సంబంధించి లేదా వాటికి సంబంధించిన ఏదైనా ప్రయోజనాల కోసం ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంక్ బీమా సంస్థకు కఠినమైన విశ్వాసంతో వెల్లడించవచ్చని సంరక్షకుడు అంగీకరిస్తాడు.

3.8

ఏ సమయంలోనైనా బ్యాంక్ ఎదుర్కొనే, కొనసాగించే, బాధపడే లేదా పర్యవసానంగా లేదా తలెత్తే మైనర్ ఖాతాను తెరవడం మరియు నిర్వహించడం వంటివి, ఏటీఎం/ డెబిట్ కార్డ్ ద్వారా ఉపసంహరణలు / లావాదేవీలు మరియు అన్నింటికీ వ్యతిరేకంగా మరియు మైనర్ ఖాతాలో సంరక్షకుడు చేసిన ఏదైనా ఉపసంహరణ / లావాదేవీల కోసం మైనర్ యొక్క ఏవైనా చర్యలు, వాదనలు, డిమాండ్లు, కార్యకలాపాలు, నష్టాలు, ఛార్జీలు మరియు ఖర్చులకు వ్యతిరేకంగా బ్యాంకుకు నష్టపరిహారం చెల్లించడానికి సంరక్షకుడు అంగీకరిస్తాడు.

3.9

వివరణ

క్లెయిమ్‎కు సంబంధించిన అన్ని రకాల పత్రాలు కంపెనీకి ప్రమాదం జరిగిన తేదీ నుంచి  60 రోజుల్లోగా అందించాలి. అలాగే ప్రమాదం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లో క్లెయిమ్‎ చేసుకోవాలి.

4

“బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్:”

4.1

రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా ఉన్నవారు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మరే ఇతర పొదుపు ఖాతాను తెరవడానికి అర్హులు కాదని నేను అర్థం చేసుకున్నాను.

4.2

నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో ఇప్పటికే పొదుపు ఖాతా (లు) కలిగి ఉంటే, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా తెరిచిన 30 రోజుల్లోపు నేను అలాంటి ఇతర పొదుపు ఖాతా (ల) ను మూసివేయవలసి ఉంటుందని నేను అంగీకరిస్తున్నాను.

4.3

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా తెరిచిన 30 రోజులలోపు ఇతర పొదుపు ఖాతా (లు) నా చేత మూసివేయబడకపోతే, రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం ఆ పొదుపు ఖాతాలు (ఏమైనా ఉంటే) మూసివేసే హక్కు బ్యాంక్ కు ఉందని నేను అంగీకరిస్తున్నాను. 

4.4

ఏదైనా నివాసి లేదా వ్యక్తి మరియు పూర్తి KYC లేనివారు BSBDA చిన్న ఖాతా తెరవడానికి అర్హులు. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే:

 • బ్యాంకు ఆమోదించే ఫోటో గుర్తింపు కార్డు కలిగి లేకపోవడం.
 • బ్యాంకు ధృవీకరించే నివాస ధృవీకరణ పత్రం లేకపోవడం.

BSBDA స్మాల్ అకౌంట్ ను వినియోగించేందుకు కావాల్సిన జాబితా కింద ఇవ్వబడింది:


4.5

BSBDA స్మాల్ ఖాతాదారుడిగా‎  నాకు కింది లావాదేవీలపై పరిమితులు ఉంటాయి:

 • BSBDA స్మాల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.50వేలను మించరాదు

లేదా

 • BSBDA కు సంబంధించిన క్రెడిట్లు ఏ సమయంలో అయినా రూ. 1 లక్షకు మించకూడదు

లేదా

 • BSBDA స్మాల్ అకౌంట్ నుంచి జరిపే నగదు ఉపసంహరణలు  లేదా నగదు బదిలీ నెలకు రూ. 10 వేలకు మించకూడదు

ఖాతాలోని బ్యాలెన్స్ రూ. 50,000 మించితే  క్రెడిట్ లావాదేవీలు అనుమతించబడవు. మళ్ళీ రూ. 50,000 వేల కంటే దిగువన బ్యాలెన్స్ ఉంటేనే  అనుమతిస్తారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ల మొత్తం రూ.1,00,000కి మించితే  ఆ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఆ ఖాతాలో క్రెడిట్ లావాదేవీలు అనుమతించబడవు.

ఒకవేళ ఉపసంహరణలు మరియు నగదు బదిలీ లు రూ. 10,000 మించితే ఆ క్యాలెండర్ నెల చివరి వరకు ఖాతాలో ఎటువంటి డెబిట్ లావాదేవీలు అనుమతించబడవు.

4.6

BSBDA ఖాతాదారుడిగా‎ ‎  నేను విధిగా  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు సమర్పించాల్సింది:

 • KYCకి దరఖాస్తు చేసినట్లుగా ఖాతా తెరిచిన 12 నెలల్లో సాక్ష్యాన్ని అందించడం(KYC జాబితాలో ఆమోదింపబడినది.)
 • ఖాతా తెరిచిన 12 నెలల్లో చెల్లుబాటు అయ్యే KYC కోసం దరఖాస్తు చేసినందుకు కింది పత్రాలు సాక్ష్యంగా పరిగణించబడతాయి:

BSBDA Small Account – Acceptable list of documents accepted towards proof of having applied for valid KYC

Documents to be established for proof of identity

కేవైసీ డాక్యుమెంట్ 

సాక్ష్యంగా ఆమోదింపబడే పత్రాలు

పాస్ పోర్టు [రద్దు చేయబడనిది]

ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న కాపీ.

పాన్ కార్డు

ఫాం 49ఏ కు సంబంధించి జిరాక్స్ 

ఓటర్ లేదా ఎలక్షన్ గుర్తింపు కార్డు 

ఫాం 6కు సంబంధించిన జిరాక్స్

డ్రైవింగ్ లైసెన్స్(శాశ్వత గుర్తింపు కలిగింది) 

ఆర్టీఓకి దరఖాస్తు చేసిన జిరాక్స్

ఆధార్ కార్డు లేదా భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన లేఖ

UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వారా జారీ చేయబడిన రసీదు లేదా  ఆధార్ దరఖాస్తుకు సంబంధించిన కాపీ

ఎన్ఆర్ఇజిఎ(NREGA) కార్డ్.

ఎన్ఆర్ఇజిఎ(NREGA) కు సంబంధించిన దరఖాస్తు జిరాక్స్ Documents to be established for proof of Address

కేవైసీ డాక్యుమెంట్

సాక్ష్యంగా ఆమోదింపబడే డాక్యుమెంట్లు

పాస్ పోర్టు[రద్దు చేయబడనిది]

ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న కాపీ.

శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్(మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేది మినహాయించి).

ఆర్టీఓకు దరఖాస్తు చేసిన కాపీ

రేషన్ కార్డు

దరఖాస్తు ఫారం కాపీ లేదా రిసిప్టు

ఎలక్షన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు[అడ్రస్ కలిగినది]

ఫాం 6 యొక్క కాపీ 

ఆధార్ కార్డు లేదా భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన లేఖ

UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వారా జారీ చేయబడిన రసీదు లేదా  ఆధార్ దరఖాస్తుకు సంబంధించిన కాపీ

ఉపాధి హామీ  కార్డు 

ఉపాధి హామీ దరఖాస్తు ఫారంకు సంబంధించిన కాపీ.

భారతదేశంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే జారీ చేయబడ్డ సీనియర్ సిటజన్ కార్డు( అడ్రస్ కలిగినది).

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా జారీ చేసే రిసిప్టు  కాపీ

మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన కమ్యూనికేషన్ చిరునామాతో ఉన్న నివాస ధ్రువీకరణ  సర్టిఫికేట్.

మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన కమ్యూనికేషన్ చిరునామాతో డొమిసిల్ సర్టిఫికేట్ దరఖాస్తు ఫాం కాపీ 

 • ఖాతా ప్రారంభించిన 24 నెలల్లోపు KYC యొక్క బ్యాంక్ ఆమోదయోగ్యమైన జాబితా ప్రకారం అసలు KYC (ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మరియు ఫోటో)

4.7

BSBDA - స్మాల్ అకౌంట్ హోల్డర్లు నేను KYC కట్టుబడి ఉన్నంత వరకు HDFC బ్యాంక్‌లో ఇతర CASA / TD / RD ని తెరవడానికి అర్హులు కాదని నేను అర్థం చేసుకున్నాను

4.8

BSBDA స్మాల్ అకౌంట్ తెరిచిన 7 రోజులలోపు ఇతర ఖాతా, పొదుపులు, టర్మ్ డిపాజిట్ ఖాతా (లు) (ఏదైనా ఉంటే), అటువంటి ఖాతా (లు) నా చేత మూసివేయబడకపోతే, వాటిని మూసివేసే హక్కు బ్యాంక్ వద్ద ఉందని నేను అంగీకరిస్తున్నాను.

5

“సీనియర్ సిటిజన్” అకౌంట్ :

సీనియర్ సిటిజన్ అకౌంట్ కలిగిన కస్టమర్లు పొందే ఇతర ప్రయోజనాలు:

వివరణ

బీమా చేసిన మొత్తం

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్( రీయింబర్స్‎మెంట్ కవర్)


సంవత్సరానికి రూ.50,000 

యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్(ఏడాది ఒకమారు)

రోజూ రూ. 500 గరిష్టంగా ఏడాదికి 15 రోజులు


ప్రస్తుతం ఈ పాలసీ HDFC ఎర్గో(ERGO) ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‎ తో అనుసంధానమై ఉంది


ఈ కవర్‎ కు సంబంధించిన నిబంధనలు మరియు షరతులు కింద ఇవ్వబడినవి:


5.1

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్: 

 1. వయో వృద్ధుల  ఖాతా కలిగిన ప్రాథమిక వ్యక్తికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది
 2. ఈ రీయింబర్స్‎మెంట్ కవర్ ఇండియాలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
 3. పాలసీ కాలంలో ప్రమాదవశాత్తు శారీరక గాయం కారణంగా వైద్యుడి సలహా మేరకు కార్డుదారుడు కనీసం 24 గంటలపాటు ఆసుపత్రిలో చేరినట్లయితే, బీమా కంపెనీ గరిష్టంగా బీమా చేసిన మొత్తం వరకు అయ్యే సహేతుకమైన మరియు సంప్రదాయ వైద్య ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.
 4. వసతి, నర్సింగ్ కేర్, వైద్యపరంగా అర్హత కలిగిన సిబ్బంది పర్యవేక్షణ, వైద్యపరంగా అవసరమైన ప్రక్రియలు మరియు వైద్య వినియోగయోగ్యమైన ప్రక్రియలు చేయించుకోవడం కొరకు ఆసుపత్రిలో ఇన్ పేషెంట్‎గా వైద్యుడి సలహా మేరకు అయ్యే సహేతుకమైన ఛార్జీలు దీనిలో చేర్చబడతాయి.
 5. ఈ క్లెయిమ్ ప్రాసెస్ అవడానికి లేదా ఆమోదించడానికి కార్డు కలిగిన వ్యక్తి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా యాక్సిడెంట్ కు 6 నెలల ముందు తన డెబిట్ కార్డు ద్వారా ఏదైనా లావాదేవీని జరిపి ఉండాలి లేదా ఆసుపత్రిలో చేరడానికి ముందు అదే నెలలో జరిపినా ఈ బీమా వర్తిస్తుంది.
 6. ఈ బీమా స్థానికంగా నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది. స్థానికంగా నివసించని వారికి వర్తించదు. 

5.2

యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్: 

 1. ఇది ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకు నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది, సంవత్సరానికి @Rs.500 చొప్పున  గరిష్టంగా సంవత్సరానికి 15 రోజులు చెల్లించబడుతుంది. దీని కొరకు 'రోజు' (24 గంటలు) ఆసుపత్రిలో ఉండాలి.

5.3

క్లెయిమ్ పొందు విధానం:

 1. ఖాతాదారుడు  ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరినట్లయితే, లబ్ధిదారుడు/లబ్ధిదారుని ప్రతినిధి ఖాతా కలిగిన బ్రాంచీని సంప్రదిస్తే, అవసరమైన డాక్యుమెంట్‎లపై బ్రాంచీ కస్టమర్ ‎కు దిశానిర్దేశం చేస్తుంది. ఈ డాక్యుమెంట్‎లను బ్రాంచీ అందుకున్న తరువాత, మా డెబిట్ కార్డు హోల్డర్‎ల కొరకు ప్రత్యేక సూచనగా, క్లెయిమ్ ప్రాసెసింగ్ చేయడం కొరకు HDFC బ్యాంక్ బీమా కంపెనీతో కలిసి ఉంటుంది. అయితే బ్రాంచీ ద్వారా డాక్యుమెంట్‎లు అందుకోవడం వల్ల క్లెయిమ్ ఆమోదించబడదు. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో ఉన్నట్లయితే, క్లెయిందారుడు వెంటనే ఖాతా బ్రాంచీకి సమాచారం అందించాలి. పాలసీ ప్రకారంగా ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా బీమా కంపెనీకి (బ్యాంకు ద్వారా) సమాచారం అందించాల్సి ఉంటుంది.


5.

డిస్‎క్లైమర్:

 1. బీమా అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం మరియు క్లెయిమ్ ల కు సంబంధించి ఏదైనా పరిహారం లేదా ప్రాసెసింగ్ లేదా ఏదైనా కారణం కొరకు HDFC బ్యాంక్ బాధ్యత వహించదు.

6

“సేవింగ్స్ మాక్స్”  అకౌంట్:

సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్‎లు కలిగి ఉన్న కస్టమర్‎లకు అదనపు ప్రయోజనం:


వివరణ

బీమా చేసిన మొత్తం


యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్ (రీయింబర్స్‎మెంట్ కవర్)

సంవత్సరానికి రూ.1,00,000

యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్

ప్రతి రోజూ రూ.1000 చొప్పున సంవత్సరానికి గరిష్టంగా 15 రోజుల పాటు 


ప్రస్తుతం ఈ పాలసీని HDFC ఎర్గో(ERGO) ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అందిస్తుంది

పాలసీకి సంబంధించిన నిబంధనలు, షరతులు కింద సూచించబడినవి:


6.1

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్ 

 • ఈ కవర్ సేవింగ్స్ మాక్స్  ఖాతా యొక్క మొదటి హోల్డర్‌కు మాత్రమే విస్తరించబడింది.
 • ఈ సౌలభ్యం అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి త్రైమాసికం తర్వాతే వర్తిస్తుంది.
 • ఈ రీయింబర్స్‎మెంట్ కవర్ కేవలం ఇండియాలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
 • పాలసీ వ్యవధిలో ప్రమాదవశాత్తు శారీరక గాయం కారణంగా సేవింగ్స్ మాక్స్ ఖాతా యొక్క మొదటి హోల్డర్ కనీసం 24 గంటలు ఆసుపత్రిలో చేరినట్లయితే, అప్పుడు బీమా సంస్థ గరిష్టంగా రూ. 1,00,000 /  పూర్తిగా నిర్థారించిన  వైద్య ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.
 • వసతి, నర్సింగ్ కేర్, వైద్యపరంగా అర్హత కలిగిన సిబ్బంది పర్యవేక్షణ, వైద్యపరంగా అవసరమైన ప్రక్రియలు మరియు వైద్య వినియోగయోగ్యమైన ప్రక్రియలు చేయించుకోవడం కొరకు ఆసుపత్రిలో ఇన్ పేషెంట్‎ గా వైద్యుడి సలహా మేరకు అయ్యే సహేతుకమైన ఛార్జీలు దీనిలో చేర్చబడతాయి.
 • క్లెయిమ్ ప్రాసెస్ చేయబడాలన్నా లేదా ఆమోదింపబడాలన్నా సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్ యొక్క మొదటి హోల్డర్ కింది రెండు నిబంధనలను పూర్తి చేసి ఉండాలి - 
 • త్రైమాసికంలో రూ.25,000లకు పైగా బ్యాలెన్స్‎ ను కనీసంగా ఉంచినట్లైతే ( ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినప్పటికీ రూ.1,00,000ల ఫిక్స్‎డ్ డిపాజిట్) ఒక క్యాలెండర్ సంవత్సరం పూర్తి చేసుకొని ఉండాలి. అది కూడా యాక్సిడెంట్‎ కు ముందు క్వార్టర్ లో జరిగి ఉండాలి.
 • అలాగే యాక్సిడెంట్ జరిగే 3 నెలల ముందు పాయింట్ ఆఫ్ సేల్(POS) మిషన్ వద్ద డెబిట్ కార్డును ఉపయోగించి కనీసం ఒక లావాదేవీ జరిపి ఉండాలి
 • ఇన్సూరెన్స్ కంపెనీ తో బ్యాంకు యొక్క వన్ పాలసీ పీరియడ్ కింద ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అనగా రూ. 1,00,000 వరకు యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ రీయింబర్స్‌మెంట్ కవర్‌ను బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇది ఏటా పునరుద్ధరణకు లోబడి ఉంటుంది.
 • 24 గంటల కన్నా ఎక్కువ ఆస్పత్రిలో ఉంటేనే ఈ ప్రమాద బీమా  వర్తిస్తుంది
 • ఈ పాలసీ కవర్ కేవలం దేశంలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది, వ్యక్తియేతర సంస్థలకు వర్తించదు.

6.2

యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ క్యాష్ 

 • ఆసుపత్రిలో చేరిన రోజు కోసం ఇది క్యాష్ బెనిఫిట్‎లను అందిస్తుంది మరియు 24 గంటలకు పైగా ప్రమాదం కారణంగా కస్టమర్ ఆసుపత్రిలో ఉన్నట్లయితే దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు. బిల్లులు పెట్టలేని ఖర్చులను కవర్ చేయడానికి ఇది ఉద్దేశించబడింది.
 • ఈ ఆర్థిక సాయం ఒక రోజుకి రూ.1,000రూపాయిలుగా సంవత్సరంలో గరిష్టంగా 15రోజుల వరకు వర్తిస్తుంది. తప్పనిసరిగా 24 గంటల కన్నా ఎక్కువగా ఆస్పత్రిలో ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది.
 • ఇన్సూరెన్స్ కంపెనీతో బ్యాంకు యొక్క ఒక పాలసీ వ్యవధి కింద 15 రోజులు అయిపోయేంత వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్ చెల్లించబడుతుంది, యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కింద క్లెయిమ్ ఆమోదించబడ్డ పరిస్థితిలో మాత్రమే ఇది జరుగుతుంది.

6.3

క్లెయిమ్‎ కు సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‎లను నష్టం జరిగిన తేదీ నుంచి అరవై (60) రోజుల్లోగా కంపెనీకి అందించాలి మరియు నష్టం జరిగిన తేదీ నుంచి ముప్పై (30) రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలి.

6.4

క్లెయిమ్ ప్రక్రియ

 • సేవింగ్స్ మ్యాక్స్ ఖాతా యొక్క మొదటి హోల్డర్ ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరినట్లయితే, క్లెయిందారుడు/క్లెయిందారుని ప్రతినిధి ఖాతా కలిగిన బ్రాంచీని సంప్రదిస్తే, అవసరమైన డాక్యుమెంట్‎లపై బ్రాంచీ కస్టమర్ ‎కు దిశానిర్దేశం చేస్తుంది. ఈ డాక్యుమెంట్‎లను బ్రాంచీ అందుకున్న తరువాత, మా సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్ హోల్డర్‎ల కొరకు ప్రత్యేక సూచనగా, క్లెయిమ్ ప్రాసెసింగ్ చేయడం కొరకు HDFC బ్యాంక్ బీమా కంపెనీతో కలిసి ఉంటుంది. అయితే బ్రాంచీ ద్వారా డాక్యుమెంట్‎లు అందుకోవడం వల్ల క్లెయిమ్ ఆమోదించబడదు. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో ఉన్నట్లయితే, క్లెయిందారుడు వెంటనే ఖాతా బ్రాంచీకి సమాచారం అందించాలి. పాలసీ ప్రకారంగా ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా బీమా కంపెనీకి (బ్యాంకు ద్వారా) సమాచారం అందించాల్సి ఉంటుంది.

6.5

డిస్‎క్లైమర్

 • బీమా అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం మరియు క్లెయిమ్ యొక్క ఏదైనా పరిహారం లేదా ప్రాసెసింగ్ లేదా ఏదైనా కారణాలకు HDFC బ్యాంక్ బాధ్యత వహించదు
 • క్లెయిమ్స్ కు పాలసీ డాక్యుమెంట్ లోని నిబంధనలు, మినహాయింపులు వర్తిస్తాయి.

6.6

రూ.10లక్షల  యాక్సిడెంటల్ డెత్ కవర్


 • ఇన్సూరెన్స్ కవర్ వాహన ప్రమాదాలకి మాత్రమే కవర్ చేయబడింది (రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు)
 • ఈ కవర్ సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్ కలిగిన మొదటి వ్యక్తికి వర్తిస్తుంది
 • ఈ క్లెయిమ్‎ ను ప్రాసెస్ చేయడానికి ప్రాథమిక అకౌంట్ కలిగిన వ్యక్తి  తమ డెబిట్ కార్డు ద్వారా ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్(POS) మిషన్ ద్వారా కనీసం 1 వస్తువును కొనాలి. అది కూడా అతడు మరణించడం కన్నా 3నెలల ముందు దినములందు జరగాలి లేదా ఆ వ్యక్తి మరణించిన నెలలో లావాదేవీ జరిగినా అది వర్తిస్తుంది

6.7

డిస్‎క్లైమర్


 • ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే, క్లెయిందారుడు/హక్కుదారుని ప్రతినిధి ఖాతా బ్రాంచీని సంప్రదిస్తే అవసరమైన డాక్యుమెంట్‎లపై బ్రాంచీ కస్టమర్ కు మార్గదర్శనం చేస్తుంది.
 • డాక్యుమెంట్లను అందుకున్న వెంటనే HDFC బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ ను ప్రాసెస్ చేసేలా తోడ్పడుతుంది.
 • బ్రాంచ్ క్లెయిమ్ డాక్యుమెంట్లు స్వీకరించినంత మాత్రాన క్లెయిమ్ ను అంగీకరించినట్లు కాదు.
 • ఒకవేళ అకౌంట్ కలిగిన వ్యక్తి అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరినా లేక మరణించినా, అతడి అకౌంట్ ఉన్న బ్రాంచీకి సమాచారం అందించాలి
 • క్లెయిమ్‎ కు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను పాలసీదారుడు మరణించిన అరవై ( 60) రోజుల్లోపు కంపెనీకి సమర్పించాలి. అలాగే 30రోజుల్లోపు క్లెయిమ్‎ కు సంబంధించిన దరఖాస్తును అందజేయాలి
 • క్లెయిమ్స్ కు పాలసీ డాక్యుమెంట్ లోని నిబంధనలు, మినహాయింపులు వర్తిస్తాయి.

7

ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్

ఉమెన్స్ సేవింగ్ అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్‎లకు అదనపు ప్రయోజనం 

వివరణ

ఇన్సూరెన్స్ చేసిన మొత్తం

వ్యక్తిగత జీవిత ప్రమాద బీమా 

రూ. 10 లక్షలు 

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్ (రీయింబర్స్‎మెంట్ కవర్)

రూ. 1 లక్ష (ప్రతి ఏడాదికి)

యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్

ప్రతిరోజూ రూ. 1,000 గరిష్టంగా సంవత్సరంలో 10 రోజులకు


ఈ పాలసీ ప్రస్తుతం HDFC ఎర్గో(ERGO) జనరల్ ఇన్సూరెన్స్‎ తో అనుసంధానమై  ఉంది


ఈ కవర్ కు సంబంధించిన నిబంధనలు మరియు షరతులు కింద ఇవ్వబడినవి: 

7.1

పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ కవర్ 

 • ఈ సదుపాయం మహిళా సేవింగ్స్ అకౌంట్‎ కు సంబంధించిన మొదటి వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది
 • ఈ క్లెయిమ్‎ ను ప్రాసెస్ చేయడానికి లేదా ఆమోదించడానికి ముందుగా ఈ మహిళా సేవింగ్స్ అకౌంట్ కలిగిన తొలి వ్యక్తి  తమ డెబిట్ కార్డు ద్వారా ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్(POS) మిషన్ ద్వారా కనీసం ఒక వస్తువును కొనాలి. అది ప్రమాదం కన్నా 6 నెలల ముందు తారీఖుల్లో జరగాలి. లేదా ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరే ముందు రోజు లేదా ఆ నెలలో ఈ లావాదేవీ జరిగినా వర్తిస్తుంది.

7.2

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్

 • ఈ సదుపాయం మహిళా సేవింగ్స్ అకౌంట్‎ కు సంబంధించిన మొదటి వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది
 • ఈ ఇన్సూరెన్స్ కవర్ ఇండియాలో మాత్రమే వర్తిస్తుంది
 • మహిళా సేవింగ్స్ అకౌంట్‎ కు సంబంధించిన ఫస్ట్ హోల్డర్ అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిన 24 గంటలలోపు డాక్టర్ సూచన మేరకు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తే.. పాలసీ నిబంధనలు అనుసరించి ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేస్తుంది. సరైన బిల్లులున్న మెడికల్ ఖర్చులకు గరిష్టంగా రూ.1,00,000 వరకు చెల్లిస్తుంది.
 • ఈ కవర్ లో సాధారణ ఛార్జీలు, ఆస్పత్రిలో వసతి, నర్సింగ్ కేర్, మెడికల్ కన్స్యూమబల్స్ మరియు మెడికల్‎ కు సంబంధించిన అవసరమైనవి వస్తాయి.
 • ఈ క్లెయిమ్‎ ను ప్రాసెస్ చేయడానికి లేదా ఆమోదించడానికి ముందుగా ఈ మహిళా సేవింగ్స్ అకౌంట్ కలిగిన తొలి వ్యక్తి  తమ డెబిట్ కార్డు ద్వారా ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్(POS) మిషన్ ద్వారా కనీసం ఒక వస్తువును కొనాలి. అది ప్రమాదం కన్నా 6 నెలల ముందు తారీఖుల్లో జరగాలి లేదా ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరే ముందు రోజు లేదా ఆ నెలలో ఈ లావాదేవీ జరిగినా అది వర్తిస్తుంది.
 • అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిన సందర్భంలో రీయింబర్స్‎మెంట్ కు సంబంధించి రూ.1,00,000 గరిష్టంగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.ఇది బ్యాంక్ మురియు పాలసీ కంపెనీల వార్షిక పునరుద్ధరణపై ఆధారపడి ఉంటుంది.
 • ఈ యాక్సిడెంట్ కవర్ అనేది 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం ఉంటేనే కవర్ అవుతుంది. 
 • ఈ కవర్ నివసించే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది వ్యక్తియేతర సంస్థలకు వర్తించదు.
 • పాలసీ యొక్క వయోపరిమితి 18 సంవత్సరాలు - 70 సంవత్సరాలు.

7.3

యాాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్ 

 • ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరి 24 గంటలకు పైగా ఉంటే, అలా ఆస్పత్రిలో ఉన్న రోజులకు ఈ పాలసీ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది. బిల్లులు సమర్పించలేని ఖర్చుల కోసమే  ఈ కవర్.
 • రోజుకు రూ. 1000 చొప్పున సంవత్సరంలో గరిష్టంగా 10 రోజులకు, ఒక వ్యక్తికి ఇది వర్తిస్తుంది. ఇక్కడ రోజు అంటే ఆస్పత్రిలో పూర్తిచేసుకున్న (24 గంటల) కాలం
 • బీమా సంస్థ తో బ్యాంకు యొక్క వన్ పాలసీ పీరియడ్ కింద 10 రోజులు పూర్తయ్యే వరకు బీమా సంస్థ యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్ చెల్లిస్తుంది, కానీ ఇది యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కింద క్లెయిమ్ అంగీకరించినప్పుడు మాత్రమే
 • ఈ నగదు ప్రయోజనాలు గరిష్టంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లించబడుతుంది.

7.4

క్లెయిమ్ పొందు విధానం

 • అకౌంట్ ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చేరడం లేదా మరణించినప్పుడు క్లెయిమ్ చేసే నామినీ/ నామినీ యొక్క ప్రతినిధి కానీ  అకౌంట్ కలిగిన ఉన్న బ్రాంచీని సంప్రదిస్తే, క్లెయిమ్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్ల గురించి దిశానిర్దేశం చేస్తారు.
 • డాక్యుమెంట్లు అందిన వెంటనే మహిళల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారి  కోసం ప్రత్యేకంగా HDFC బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి క్లెయిమ్ ను ప్రాసెస్ చేసేలా తోడ్పడుతుంది.
 • బ్రాంచ్ డాక్యుమెంట్లను స్వీకరించి నంత మాత్రాన క్లెయిమ్ ను అంగీకరించినట్లు కాదు.
 • ఒకవేళ అకస్మాత్తుగా అకౌంట్ దారుడు ఆస్పత్రి పాలైన లేదా మరణించిన వెంటనే క్లెయిమ్ దారుడు అకౌంట్ బ్రాంచీకి సమాచారం అందించాలి.
 • పాలసీ ప్రకారం యాక్సిడెంట్ జరిగిన 30 రోజులలోపు బ్యాంక్ ద్వారా బీమా సంస్థకు  సమాచారం అందజేయబడాలి.

7.5

వివరణ:

 • ఇన్సూరెన్స్ అనేది ఖాతాదారుల విన్నపానికి సంబంధించింది. HDFC బ్యాంక్ మీకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం గానీ ఎలాంటి క్లెయిమ్‎ లను ఏ విధంగానూ మంజూరు చేయబడదు .
 • క్లెయిమ్స్ కు పాలసీ డాక్యుమెంట్ లోని నిబంధనలు, మినహాయింపులు వర్తిస్తాయి.
 • బ్రాంచ్ డాక్యుమెంట్లను స్వీకరించి నంత మాత్రాన క్లెయిమ్ ను అంగీకరించినట్లు కాదు.