వాట్ ఇస్ డీమ్యాట్ అకౌంట్? డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలుగా మీరు 'డీమాట్ అకౌంట్' అనే పదాన్ని తరచుగా వినే ఉంటారు. డీమ్యాట్‌ అకౌంట్ అంటే ఏంటి అని మీరు ఆలోచిస్తుంటే, ఇప్పుడు దాన్ని మీకు వివరిస్తాం.

డీమాట్ అకౌంట్ అనేది ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉండే మీ షేర్ సర్టిఫికేట్‌లు, ఇతర సెక్యూరిటీల కోసం బ్యాంక్ అకౌంట్ వంటిది. డీమెటీరియలైజేషన్ అకౌంట్‌ను చిన్నగా డీమ్యాట్ అంటారు. షేర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ , ఇటిఎఫ్ వంటి పెట్టుబడులను కలిగి ఉండే ప్రక్రియను సులభతరం చేస్తుంది. పేపర్ షేర్లు, సంబంధిత డాక్యుమెంట్‌ భౌతికరూపంలో నిర్వహణ, ఇతర చిరాకులను తొలగిస్తుంది.

డీమ్యాట్ అకౌంట్ అర్థం చేసుకునేందుకు మనం ఒక ఉదాహరణను ఉపయోగిద్దాం. కంపెనీ ఎక్స్ షేర్లను మీరు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారనుకుందాం. మీరు ఆ షేర్లను కొనుగోలు చేసినప్పుడు, వాటిని మీ పేరిట బదిలీ చేయాల్సి ఉంటుంది. మునుపటి కాలంలో, మీరు ఎక్స్ఛేంజ్ నుండి మీ పేరుతో భౌతిక రూపంలో వాటాల సర్టిఫికేట్లను పొందారు. మీరు ఊహించినట్లుగానే దీనికి టన్నుల కొద్దీ పేపర్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వాటాను కొనుగోలు చేసి విక్రయించిన ప్రతిసారీ, ఒక సర్టిఫికేట్ సృష్టించాల్సి వచ్చింది. ఈ పేపర్ వర్క్‌ను తొలగించేందుకు 1996లో డీమ్యాట్‌ అకౌంట్‌ వ్యవస్థను భారతదేశం ఎన్ఎస్ఈలో ప్రవేశపెట్టింది.

ఈ రోజు, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే, భౌతికరూపంలో సర్టిఫికేట్లు జారీ చేయకుండానే మీరు ఓ కంపెనీ షేర్లు కొనుగోలు చేసినప్పుడు మీ డీమ్యాట్‌ ఖాతాలో ఎలక్ట్రానిక్‌ రూపంలో ఎంట్రీ మాత్రమే లభిస్తుంది. దీన్నే డిమ్యాట్‌ అకౌంట్‌ అని అంటారు.

ఈ రోజు మీరు స్టాక్ మార్కెట్ (ఎన్ఎస్ఈ, బిఎస్ఇ) లేదా ఇతర సెక్యూరిటీలలో ట్రేడ్/పెట్టుబడి పెట్టాలనుకుంటే, డీమ్యాట్‌ ఖాతా ను కలిగి ఉండటం తప్పనిసరి. మీరు చేసే ట్రేడ్ లు మరియు లావాదేవీల యొక్క ఎలక్ట్రానిక్ సెటిల్ మెంట్ ల కొరకు మీ డీమ్యాట్‌ అకౌంట్ నెంబరు తప్పనిసరి.

డీమ్యాట్‌ ఖాతాను ఎలా పొందాలి?

ఇప్పుడు మీకు డీమ్యాట్‌ ఖాతా అంటే ఏమిటో తెలుసు కాబట్టి, మీరు దానిని ఎలా పొందగలరో చూద్దాం. మీరు డీమ్యాట్ ఖాతాను తెరిచినప్పుడు, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్) లేదా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఎస్‌డిఎల్) వంటి సెంట్రల్ డిపాజిటరీతో మీరు ఒక అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ డిపాజిటరీలు తమకు, పెట్టుబడిదారులకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ (డిపి) అనే ఏజెంట్లను నియమిస్తారు. ఉదాహరణకు, మీ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిపి అనుకుందాం. దానితో మీరు డిమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. స్టాక్‌ బ్రోకర్లు, ఆర్థిక సంస్థలు కూడా డిపిలుగానే ఉంటారు. వీరి వద్ద కూడా మీరు డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

బ్యాంకు అకౌంట్‌లో ఎలక్ట్రానిక్‌ రూపంలో డబ్బు ఉన్నట్లుగానే, డీమ్యాట్‌ అకౌంట్‌లో మీ పెట్టుబడులు ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటాయి. ల్యాప్‌టాప్‌ లేదా ఇంటర్నెట్‌ కనెక్ట్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ లేదా స్మార్ట్‌ పరికరంతో వీటిని యాక్సెస్‌ చేసుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా దాన్ని యాక్సెస్ చేసుకునేందుకు ప్రత్యేకమైన లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌. అయితే, బ్యాంక్‌ ఖాతాలా గాకుండా డీమ్యాట్‌ అకౌంట్‌కు ఎలాంటి 'కనీస బ్యాలెన్స్' అవసరం లేదు.

ఏ డిపి వద్ద డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చో ఆ డిపిల జాబితాను మీరు ఏదైనా డిపాజిటరీ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయొచ్చు. వార్షిక ఛార్జీల ఆధారంగా డిపిని ఎంచుకోవాలి.

ఒకే డీపితో గాకుండా ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్‌ అకౌంట్లు ఉన్నాయని మీరు గమనించండి. కాబట్టి పాన్‌ కార్డుతో బహుళ డీమ్యాట్‌, ట్రేడింగ్‌ అకౌంట్లను లింక్‌ చేయవచ్చు.

డీమ్యాట్ అకౌంట్‌ వివరాలు

మీ డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తరువాత, మీ డిపి నుంచి దిగువ వివరాలను మీరు పొందేలా ధృవీకరించుకోండి:

  • డీమ్యాట్ ఖాతా నెంబరు: సిడిఎస్ఎల్ కింద అకౌంట్‌ ఉంటే దీన్ని 'లబ్ధిదారు ఐడి' అని అంటారు. ఇది 16 క్యారెక్టర్లు ఉంటాయి.

  • డిపి ఐడి: డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ఇచ్చే ఐడి. డీమ్యాట్‌ అకౌంట్‌ నెంబర్‌లో కొంత భాగంతో ఈ ఐడి ఉంటుంది.

  • పిఓఎ నెంబరు: ఇది పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంట్‌లో భాగం, ఇక్కడ ఒక పెట్టుబడిదారుడు నిబంధనల ప్రకారం అతడి/ఆమె అకౌంట్ ఆపరేట్ చేయడానికి స్టాక్‌ బ్రోకర్‌కి అనుమతిస్తాడు. .

ఆన్ లైన్ యాక్సెస్ కోసం మీ డీమ్యాట్‌ అండ్‌ ట్రేడింగ్‌ అకౌంట్‌లకు ప్రత్యేక లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌ అందుకుంటారు.

డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు

డీమాట్ ఖాతా సాధారణంగా ట్రేడింగ్ ఖాతాతో పాటుగా ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసేందుకు, విక్రయించేందుకు అవసరం అవుతుంది. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 3 ఇన్‌ 1 అకౌంట్ ఆప్షన్‌ కలిగి ఉంది. సేవింగ్స్ అకౌంట్, డీమ్యాట్‌ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఒకే ఖాతాలో వస్తాయి.

కొన్నిసార్లు, ఖాతాదారులు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ అకౌంట్ల మధ్య తేడాను గుర్తించేందుకు గందరగోళానికి గురవుతారు. అవి ఒకే విధంగా ఉండవు. డీమ్యాట్‌ అకౌంట్‌లో మీ పేరిట ఉన్న షేర్లు, ఇతర సెక్యూరిటీల వివరాలు ఉంటాయి. షేర్లను కొనుగోలు చేసేందుకు, విక్రయించేందుకు, మీరు ట్రేడింగ్‌ అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. అనేక బ్యాంకులు, బ్రోకర్లు ఆన్ లైన్ ట్రేడింగ్ సదుపాయాలతో ట్రేడింగ్ అకౌంట్లను అందిస్తున్నారు. పెట్టుబడిదారులు స్టాక్‌మార్కెట్ల్లో పాల్గొనే ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది.

డీమ్యాట్ ఖాతాల రకాలు

ఇప్పుడు మనం డీమ్యాట్‌ అకౌంట్ నిర్వచనాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు డీమ్యాట్‌ అకౌంట్ రకాలను చూద్దాం. ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి:

  • రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్: ఇది దేశంలో నివసించే భారతీయ పౌరుల కోసం .

  • రెపాట్రియబుల్ డీమ్యాట్‌ ఖాతా: ఈ రకమైన డీమ్యాట్‌ ఖాతా ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) కోసం. ఇది డబ్బును విదేశాలకు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే, ఈ రకం డీమ్యాట్‌ ఖాతాను ఎన్‌ఆర్‌ఈ బ్యాంకు ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుంది.

  • నాన్ రెపట్రబుల్ డీమ్యాట్‌ అకౌంట్:ఇది మళ్లీ ఎన్ఆర్ఐ కోసం. అయితే ఈ డీమ్యాట్‌ అకౌంట్‌తో విదేశాలకు ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సాధ్యం కాదు. అలాగే, దీన్ని ఎన్‌ఆర్‌ఓ బ్యాంకు ఖాతాకు లింక్‌ చేయాల్సి ఉంటుంది.

మీరు డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని చూస్తున్నారా? మీరు డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించడానికి క్లిక్ చేయండి!

మీరు స్వల్పకాలిక పెట్టుబడి లక్ష్యాల గురించి చూస్తున్నారా, వాటి గురించి మరింత తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి!

* ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన సమాచారం స్వభావరీత్యా సాధారణమైనది. సమాచార ప్రయోజనం కోసమే ఇచ్చినది. మీరున్న వ్యక్తిగత పరిస్థితుల్లో నిర్దిష్ట సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు.